హమ్మయ్య కరోనా తగ్గుముఖం పట్టింది.. ఇక లాక్‌డౌన్ ఎత్తివేతకు సమయం దగ్గరపడుతుందని ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్న వేళ.. ఒక్కొక్కటిగా కరోనా కేసులు బయటకు వస్తున్నాయి.. ఇప్పటికే ప్రజలు కరోనా భయంతో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న.. వారి ప్రమేయం లేకుండానే వ్యాపారుల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది.. మనిషికి ముఖ్యమైనవి నిత్యావసర సరకులు.. ఇవిలేకుంటే బ్రతకడం కష్టం కానీ వీటిద్వారానే కరోనా వ్యాపిస్తుందంటే భయంగా ఉండదా.. అదేంటని ఆశ్చర్యపోకండి.. కిరాణ షాపుల ద్వారా.. కూరగాయలు అమ్మే వారి ద్వారా కరోనా వస్తుంటే ఇక ఏం కొనుక్కొని తినాలో అర్ధం కాని స్దితిలో ప్రజలు బిక్కు బిక్కుమంటున్నారు..

 

 

ఇకపోతే తాజాగా కూరగాయలు విక్రయిస్తున్న 28 మంది వ్యాపారులకు కరోనా వైరస్ సోకిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా నగరంలో వెలుగుచూసింది. కూరగాయల వ్యాపారులకు ఈ వైరస్ ఎలా సోకిందో గుర్తించేందుకు రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా 160 మంది వీధి వ్యాపారులు, కూరగాయల వ్యాపారులు, కిరాణా దుకాణాదారులకు కరోనా పరీక్షలు చేయగా వారిలో 28 మంది కూరగాయల వ్యాపారులకు కరోనా పాజిటివ్ అని వచ్చిందని ఆగ్రా నగర ఎస్పీ రోహాన్ బోట్రే చెప్పారు.

 

 

ఇక గత పదిరోజుల్లో 28 మంది కూరగాయల వ్యాపారులకు ఒక్క ఆగ్రా నగరంలోనే కొవిడ్-19 పాజిటివ్ అని పరీక్షల్లో తేలింది. దీన్ని బట్టి అర్ధం అయ్యేది ఏంటంటే ఈ వైరస్ వ్యాపించకుండా చాలా కఠినంగా ఉండాలని తెలుస్తుంది.. ఎక్కడికెళ్లిన సాధ్యమైనంతగా జాగ్రత్త చర్యలతో మన పనులు ఒడ్డెక్కించుకోవాలి.. ఏమాత్రం ఎమరుపాటుగా ఉన్నా ఇదిగో ఇలానే వ్యాపిస్తుంది ఈ వైరస్..

 

 

ఇదిలా ఉండగా కరోనా వచ్చిన కూరగాయల వ్యాపారులను క్వారంటైన్ కు తరలించి, మండీని మూసేసిన అధికారులు ఇంటివద్దకే  కూరగాయలు పంపిణీ అయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఇకపోతే కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో పండ్ల మార్కెట్ లోనూ, ఇతర దుకాణాల వద్ద  ప్రజలు సామాజిక దూరం పాటించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వీరి మాటలు విని అవి పాటిస్తే సరి.. లేదంటే మీరు కూడా కరోనా బాదితులు అవడానికి ఆస్కారం ఉంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: