ఈ కరోనా ఏందిరా బాబు.. దీని వల్ల నాలుక పిడచకట్టుకు పోతుంది.. అయితే మంచి నీళ్లు తాగవచ్చు అని అంటారా.. ఇది మంచినీళ్ల దాహం కాదురా బాబు.. మందు దాహం.. ఒక ఫుల్ కొడితే గానీ ఈ దాహం తీరదు అని అంటున్నారు మందు ప్రేమికులు.. వీరి కలను నిజం చేస్తూ కేంద్రం మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఇప్పుడు మందు బాబులు ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురౌతుంటే ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగిసి ఎగిసి పోతుంటే ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి.. అంటూ మందు కోసం పాటలు పాడుకుంటున్నారు..

 

 

ఇకపోతే ఒక్క తెలంగాణాలో తప్పా.. దాదాపుగా అన్నిచోట్ల వైన్స్ షాపులు ఒపెన్ అవగా కిలోమీటర్ల మేర క్యూలో ఉండి.. మందు కొన్న మద్యం ప్రియుల కళ్లల్లో ప్రపంచ కప్ గెలిచినప్పుడు కలగని ఆనందం ఇప్పుడు కనిపిస్తుంది.. ఇక ఊరుకుంటారా.. విపరీతమైన సేల్స్‌ను పెంచేశారు.. మరొక సారి మద్యంతోనే రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం అని నిరూపించారు.. ఈ తాగుబోతులు లేకుంటే ప్రపంచం ఏమైపోతుందనే బెంగ కలిగేలా చేశారు.. ఇదిలా ఉండగా కర్ణాటకలో మద్యం అమ్మకాలు రికార్డు సృష్టించాయట.. కౌంటర్ ఒపెన్ చేసిన తొలిరోజే దాదాపుగా .45 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయని కర్ణాటక ఎక్సైజ్ శాఖ ప్రకటించింది.

 

 

వామ్మో మద్యం కోసం ప్రజలు ఎంత ధనం దాచారు అని అనిపిస్తుంది కదా.. ఇక కర్ణాటక లో మూడో దశ లాక్‌డౌన్ అమలవుతుంది.. అయినా గానీ మందు షాపులు తెరవగానే ప్రపంచాన్ని తొలిసారిగా చూస్తున్నామన్న ఆనందంతో మద్యం షాపుల ముందు మద్యం ప్రియులు బారులు తీరారు. ఇకపోతే బెంగళూరులో కొన్ని మద్యం దుకాణాల వద్ద మహిళల కూడా మద్యం కోసం క్యూ లైన్లలో నిల్చోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.. ఇక ఈ లెక్కలు చూస్తుంటే ఏ స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయో స్పష్టం అవుతుంది.. కాగా మన తెలంగాణ ఈ లెక్కను బీట్ చేస్తుంది కావచ్చు.. చూడాలి.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: