ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా  వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్  కొనసాగుతున్న విషయం తెలిసిందే. దాదాపుగా 40 రోజులకు పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్ డౌన్  కొనసాగింది. ఈ నేపథ్యంలో ఎప్పుడో  జరగాల్సిన పదో తరగతి పరీక్షలు ఇప్పటికీ కూడా జరగకుండానే ఉన్నాయి. దీంతో పది పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు అనే దానిపై విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అయోమయం లోనే ఉన్నారు. కరోనా  వైరస్ ఉన్నప్పటికీ పదవతరగతి పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ముందుగా  భావించినప్పటికీ... అదే సమయంలో కరోనా  వైరస్ ప్రభావం తీవ్రంగా పెరిగిపోవడంతో పరీక్షలను వాయిదా వేయక తప్పలేదు. దీంతో 10 పరీక్షల కోసం సంసిద్ధమైన విద్యార్థులందరికీ నిరాశే ఎదురైంది అని చెప్పాలి. 

 

 

 అయితే దాదాపు 40 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్ డౌన్  కొనసాగగా ఇప్పుడిప్పుడే కొంత సడలింపు చేస్తుంది ఆంధ్రప్రదేశ్ సర్కారు. గ్రీన్ ఆరెంజ్ రెడ్ జోన్లు అంటూ మూడు ప్రాంతాలుగా విభజించి ప్రస్తుతం పలు నిబంధనలను అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో 10 పరీక్షలకు సంబంధించిన చర్చ మరోసారి మొదలైంది. పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు. పదవ తరగతి పరీక్షలకు సంబంధించిన నిర్వహణపై షెడ్యూల్ని ప్రభుత్వం సిద్ధం చేస్తోందా..?  అనే దానిపై ప్రస్తుతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు. 

 

 

 అయితే ప్రస్తుతం లాక్ డౌన్  క్రమక్రమంగా ఎత్తి వేస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవతరగతి పరీక్షలు నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కసరత్తులు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం దృశ్య సామాజిక దూరం పాటిస్తూనే పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ. ఒక పరీక్ష హాలులో కేవలం 12 మంది విద్యార్థులు మాత్రమే పరీక్షలు రాసే విధంగా పలు కీలక చర్యలు చేపడుతోంది. ప్రతి విద్యార్థికి మధ్య ఆరు అడుగుల దూరం ఉండడంతో పాటు ప్రతి బెంచ్ కి  ఒక్క విద్యార్థి మాత్రమే కూర్చునేలా ఏర్పాట్లు చేస్తోంది విద్యాశాఖ. కొత్త రూల్స్ అమలు చేస్తూ పదవతరగతి పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ ప్రస్తుతం మార్గదర్శకాలను రూపొందిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: