ప్రపంచ వ్యాప్తంగా మానవాళిని కుదిపేస్తూ ప్రధాన మంత్రుల దగ్గర నుండి సామాన్యుల వరకు అందర్నీ అతలాకుతలం చేస్తున్న కరోనా కట్టడికి వ్యాక్సిన్ కనుక్కోవాలని కొన్ని వందల పరిశోధన బృందాలు అహో రాత్రులు తమ పరిశోధనలు కొనసాగిస్తున్నా కరోనా కు సంబంధించిన వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి కనీసం మరో ఆరు నెలలకు పైగా సమయం పట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితులలో ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా దొంగతనాలు హత్యల నేర పరిశోధనలలో పోలీసులకు సహాయం చేస్తున్న కుక్కలు ద్వారా కరోనా వైరస్ ను పసిగట్టవచ్చు అన్న ఆలోచన ఒక జర్మన్ శాస్త్రవేత్తకు వచ్చినట్లు తెలుస్తోంది. 


ఈ ఆలోచన రావడంతో వెంటనే ఆ జర్మన్ శాస్త్రవేత్త శక్తివంతమైన వాసనలను పసిగట్టే గుణం కలిగిన కొన్ని జాతులకు సంబంధించిన కుక్కలను ఎంపికచేసి వాటికి కరోనా వైరస్ సోకిన రోగి యొక్క రక్తపు నమూనా వాసనలు చూపెడుతూ కరోనాను గుర్తించగల సామర్ధ్యం ఆ కుక్కలకు ఉండేలా అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన ఈ జర్మన్ శాస్త్రవేత్త ప్రస్తుతం ఈపరిశోధనలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా ను గుర్తించేందుకు ప్రస్తుతం సేకరించిన నెగిటివ్ పాజిటివ్ బ్లడ్ నమూనాలను శునకాల చెంత ఉంచుతూ వాటికి ఈప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. 


ఈప్రయోగం విజయవంతం అయితే ఒక వ్యక్తికి కరోనా ఉందా లేదా అన్న విషయం టెస్ట్ లు చేయకుండా కేవలం ఆవ్యక్తి రక్తపు నమూనాను బట్టి ఆ కుక్క కరోనా వైరస్ ను పసిగడుతుందని ఈ శాస్త్రవేత్త చెపుతున్నాడు. ప్రస్తుతం 3 వేల కుక్కలకు ఈ విషయంలో శిక్షణ ఇస్తున్న ఈ శాస్త్రవేత్త ప్రయోగాలు విజయవంతం అయితే ఈ కుక్కలు అన్నీ జూలై నాటికి కరోనాను పసిగట్టే కార్యక్రమంలోకి అమెరికాలో దిగుతాయని ఈ శాస్త్రవేత్త ఆశాభావం. 


ఈ ప్రయోగం విజయవంతం అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ జాతులకు చెందిన 30 కోట్ల సునకాలకు ఈ కరోనా టైమ్ లో మంచి డిమాండ్ ఏర్పడుతుంది. మనిషి రక్తంలోని క్యాన్సర్ లక్షణాలను రక్తపు నమూనాల వాసన ద్వారా పసిగట్టవచ్చు అని పరిశోధన చేసి విజవంతమైన ఈ శాస్త్రవేత్త కుక్కల పరిశోధన విజవంతం అయితే కరోనా వైరస్ ను పసిగట్టడంలో కుక్కలు ప్రధాన పాత్ర పోషించబోతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: