ఏదైనా పోగొట్టుకోవడం చాలా ఈజీ కానీ తిరిగి పొందడమే కష్టం.. ఇది నిజమని చాలా సందర్భాల్లో రుజువు అయ్యింది కూడా.. త్వరలో మరో సారి నిజమవబోతుంది.. అదేమంటే కరోనా వైరస్ వ్యాపిస్తున్న సమయంలో ఆ వ్యాధి వ్యాప్తికి అడ్డుకట్టగా ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించాయి.. ప్రజలందరు ఇళ్ల నుండి బయటకు రావద్దని హెచ్చరించాయి.. కానీ వారు చెప్పినట్టు వింటే మనదేశం ఇలా ఉండకపోవచ్చు కావచ్చూ.. అందుకని మీరేంది చెప్పేది, మేం వినేదని చాలామంది వారి వాహనాలను తీసుకుని రొడ్డెక్కారు ఇంకేముంది.. మీపని ఇలా కాదని ఆ వాహనాలను సీజ్ చేశారు పోలీసులు..

 

 

ఇంత వరకు బాగానే ఉంది.. కానీ వారు తీసుకున్న వాహానాలకు రశీదు ఇచ్చారా.. లేదు.. పోనీ అవి ఎక్కడ భద్రపరస్తున్నారో చెప్పారా.. అదీ లేదు.. ఒక ఫ్రెండ్ అడిగితే కూడా ఇన్ని రోజులు మీ వాహనాలను ఇవ్వని వారు.. ఇప్పుడు ఏకంగా నెలలు నెలలు పోలీసుల చేతిలో పెట్టి ఏం తెలియనట్లు ఉన్నారు.. ఇదిలా ఉండగా పోలీసులు సాధారణంగా వాహనాలను సీజ్‌ చేస్తే.. లేదా ఈ-చలానాలు విధిస్తే.. వాహనదారుడి సెల్‌ఫోన్‌కు మెసేజ్‌లు వస్తాయి. లాక్‌డౌన్‌ సీజ్‌లలో అలాంటి సమాచారం లేకపోవడం వాహనదారులను ఆందోళనకు గురిచేస్తోంది. అదీగాక సీజ్ చేసిన సమయంలో చెక్‌పోస్టుల వద్ద ఉండే పోలీసులు.. లాక్‌డౌన్‌ తర్వాతే వాహనాలను తిరిగి ఇస్తామని  చెబుతుండగా, ఉన్నతాధికారులు మాత్రం వాహనాలను కోర్టుకు అప్పగిస్తామంటూ ప్రకటనలు చేస్తుండటంతో వాహనదారుల పరిస్దితి అయోమయంగా మారింది..

 

 

ఇదంతా పక్కన పెడితే సీజ్‌ చేసిన వాహనాలను పార్క్‌ చేసే సదుపాయాలు నగరంలో ఏ పోలీస్ స్టేషన్లలో లేకపోవడంతో.. వాటిని మైదానాలు, రోడ్లపక్కనే పార్క్ చేయగా, అవి ఎండకు ఎండి, వానకు నానుతూ.. తిరిగి వాహనదారుడి చేతికి వచ్చేసరికి మరమ్మతులపాలయ్యే ప్రమాదాలున్నాయి. కాగా.. అంటు వ్యాధుల నియంత్రణ చట్టం కింద వాటిని సీజ్‌ చేయడం వల్ల.. కోర్టులో రూ. 500 నుంచి రూ. 2,000 వరకు జరిమానా చెల్లించాల్సి రావొచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఏది ఏమైనా కండీషన్‌గా వెళ్లిన వాహనాలు అన్‌కండీషన్లో మీ చేతికి రావడం మాత్రం ఖాయం.. 

మరింత సమాచారం తెలుసుకోండి: