ఏపీలో విపక్ష టీడీపీ కి వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కేవలం ఇరవై మూడు సీట్లకు పరిమితం అయిన తెలుగుదేశం పార్టీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు బయటకు వచ్చేశారు కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ తో పాటు గుంటూరు జిల్లా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మ‌ద్దాలి గిరిధ‌ర్ రావు టీడీపీ కి దూరం కాగా ఇక మరో సీనియర్ నేత ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం సైతం తన కుమారుడు కరణం వెంకటేష్ ను వైసీపీ లో చేర్పించిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం వైసీపీకి కేవలం 20 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. వీళ్ళు ఎప్పుడు ఎవరు ? చంద్రబాబుకు షాక్ ఇస్తారో కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఇక‌ ఇప్పుడు మరో సీనియర్ ఎమ్మెల్యే సైతం బాబోరికి షాక్ ఇస్తార‌న్న మాట వినిపిస్తోంది.

 

స‌ద‌రు ఎమ్మెల్యే ఎవ‌రో కాదు ప్ర‌కాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వికుమార్‌. గ‌తంలో కాంగ్రెస్ నుంచి వ‌రుస‌గా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ర‌వి 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి గెలిచారు. ఆ త‌ర్వాత ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ నేప‌థ్యంలో గొట్టి పాటి సైకిల్ ఎక్కేశారు. ఇక 2019 ఎన్నిక‌ల్లో ఏపీలో టీడీపీ చిత్తుగా ఓడిపోయినా ర‌వి మాత్రం అద్దంకిలో మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. అదే టైంలో వ‌రుస‌గా ర‌వికి నాలుగో విజ‌యం ద‌క్కింది. ఇప్పుడు ప్ర‌కాశం జిల్లాలో ఉన్న అంద‌రి ఎమ్మెల్యేల్లోనూ ఓట‌మి అనేది లేకుండా నాలుగు సార్లు గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా ర‌వి ఉన్నారు.

 

ఈ క్ర‌మంలోనే కొద్ది రోజులుగా ర‌వి గ్రానైట్ వ్యాపారాల‌పై దాడులు జ‌రుగుతున్నాయి. జిల్లాకే చెందిన మంత్రి బాలినేని ద్వారా ర‌వి ఈ విష‌యంలో ఇప్ప‌ట‌కి అయితే కాస్త ఉప‌శ‌మ‌నం పొందార‌ని అంటున్నారు. మ‌రి రేపో మాపో అయినా ర‌వి వైసీపీ గూటికి చేరేందుకు రెడీ అవుతున్నార‌ట‌. అయితే ఆయ‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థిగా ఉన్న క‌ర‌ణం బ‌ల‌రాం కూడా వైసీపీలో ఉండ‌డంతో ఇప్పుడు ర‌వి విష‌యంలో వైసీపీ ఏం డెసిష‌న్ తీసుకుంటుందో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: