ప్రస్తుతం భారతదేశాన్ని దిక్కుతోచని స్థితిలో పడేసిన కరోనా వైరస్ రోజురోజుకీ అసామాన్య రీతిలో విజృంభిస్తున్న విషయం తెలిసిందే. గతంలో రోజుకి 1500, 2000 మందికి పాజిటివ్ అని తేలేది. అయితే ఇప్పుడు సంఖ్య కాస్త ఏకంగా 2500 చేరడంతో అధికారుల గుండెల్లో గుబులు మొదలైంది. ఇక రోజు నమోదవుతున్న పాజిటివ్ కేసులు చాలావాటికి లింక్స్ దొరకకపోవడం కూడా మరొక ఆందోళన పరిచే విషయం.

 

ఇటువంటి సమయంలో రోజు మనం నిత్యావసర వస్తువుల లో భాగంగా కూరగాయలు కొనడానికి వెళ్లే వ్యాపారులకు వైరస్ సోకిందన్న విషయం ఇప్పుడు దేశంలో సంచలనం రేపుతోంది. కూరగాయలు విక్రయిస్తున్న దాదాపు 28 మంది వ్యాపారులకు కరోనా వైరస్ సోకిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా నగరం లో వెలుగుచూసింది. ఒక్క ఆగ్రా నగరంలోనే గత పది రోజుల్లో 28 మంది కూరగాయల వ్యాపారులకు కోవిడ్-19 పాజిటివ్ అని పరీక్షల్లో తేలడం ఇప్పుడు సంచలనం రేపుతోంది.

 

ఒక వ్యాపారి దగ్గరకి ఎంత మంది వచ్చి కూరగాయలు కొన్నారు.. వారికి ఒక వేళ కరోనా సోకి ఉంటే వారు వెళ్లి ఎంతమందిని కలిశారో తెలుసుకోవడానికి అధికారులు నానా అవస్థలు పడుతున్నారు. ఇక అసలు వ్యాపారులకు ఎలా సోకిందో లింక్ ను గుర్తించేందుకు పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు.

 

160 మంది వీధి వ్యాపారులు, కూరగాయల వ్యాపారులు, కిరాణా దుకాణాల వ్యాపారులకు కరోనా పరీక్షలు చేయగా వారిలో 28 మంది కూరగాయల వ్యాపారులకు కరోనా పాజిటివ్ అని వచ్చిందని ఆగ్రా నగర ఎస్పీ రోహాన్ బోట్రే చెప్పారు. కరోనా వచ్చిన కూరగాయల వ్యాపారులను క్వారంటైన్ కు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: