కేంద్ర ప్రభుత్వం మూడవ దశ లాక్ డౌన్ను అమలు చేసిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా కొన్ని సడలింపులను చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే గ్రీన్ మరియు ఆరెంజ్ జోన్ లలో మద్యం విక్రయాలకు అనుమతినిచ్చింది. దేశవ్యాప్తంగా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్న నిర్ణయానికి ప్రజలు తమ పూర్తి సహకారాన్ని తెలిపారు.

 

ఇన్ని రోజులు మద్యం చుక్కలేక గోతు తడారిపోయిన మందుబాబులు అందరూ లిక్కర్ షాపుల ముందు కిలోమీటర్ల దూరంలో బారులుతీరారు. మందుబబులు పగలంతా షాపుల ముందు క్యూ కట్టిన దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో రోజంతా చక్కర్లు కొట్టాయి. కొందరైతే ఉదయం లేచినప్పటి షాపులు తీయక ముందు నుంచి గంటల తరబడి కిలోమీటర్లు బారులుతీరారు. హడావిడిలో మద్యం ధరలు 25 % పెంచినా కూడా ఎవరూ పట్టించుకోలేదు.

 

దీనితో నిన్న ఒక్కరోజే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మద్యం విక్రయాల ద్వారా 45 కోట్ల రూపాయలు వచ్చాయి. మొత్తం భారతదేశపు అతిపెద్ద బ్లాక్ బస్టర్ బాహుబలి-2 మొదటి రోజు కలెక్షన్స్ కన్నా ఎక్కువ. బాహుబలి-2 చిత్రం ఏపీ మరియు తెలంగాణలో మొదటి రోజు 43 కోట్ల కలెక్షన్ సాధిస్తే మన మందుబాబులు అంతా కలిసి ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికే దాదాపు 45 కోట్ల రూపాయలు మందులు కొనుగోలు చేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఒక చేత్తో నిలబెట్టారు.

 

అయితే మద్యంషాపులు తీసినా .. రాష్ట్రంలో దశల వారిగా మద్యపానాన్ని నిషేధించడమే ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి బొత్స సత్యనారాయణ అంటున్నారు . అందులో భాగంగానే ధరలు పెంచామని , మద్యం తాగేవారిని తగ్గించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెబుతున్నారు . ప్రభుత్వం ధనార్జన కోసం చూస్తుందన్న విమర్శలను మంత్రి బొత్స సత్యనారాయణ ఖండించారు . మేరకు టీడీపీ నేత యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు .

మరింత సమాచారం తెలుసుకోండి: