కరోనా వైరస్ కట్టడిలో భాగంగా దేశం మొత్తం లాక్ డౌన్ విధానాన్ని అమలు చేస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. అయితే ఈ దెబ్బకు అన్ని రంగాల్లో కొంత కుంటు పడ్డాయని చెప్పవచ్చు. అయితే ఈ ప్రభావం తెలంగాణలో గ్రామీణ వ్యవస్థ పై చాలా ఎక్కువగా పడింది. నిజంగా అర్బన్ ప్రాంతాలతో పోలిస్తే పల్లె ప్రాంతాల్లో చిల్లర వ్యాపారులు, రోడ్డు పక్కన బండ్లు పెట్టుకునే వారు, దుకాణాల వారు, మెకానిక్ షెడ్లు, ఎలక్ట్రికల్ షాప్ ఇలా చెప్పుకుంటూ వెళితే ప్రతిదీ దెబ్బతిన్నాయని చెప్పవచ్చు.

 

అయితే ఒక ప్రముఖ జాతీయ దినపత్రిక గ్రామీణ ప్రాంతాల్లో లాక్ ప్రభావం ఎలా ఉందన్న విషయాన్ని పరిశీలించడానికి ఒక బృందాన్ని పంపించారు.అయితే దినపత్రిక తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్, తాండూరు మండలం లో పర్యటించింది. అయితే అక్కడ పలువురుతో మాట్లాడిన తర్వాత అనేక విషయాలను వెలుగులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం వారి దైనందిక జీవితం దుర్భరంగా మారిందని ఆ పత్రిక తెలియజేసింది. కొన్ని గ్రామాల్లో నిజానికి ఇప్పటి వరకు ప్రభుత్వ సాయం కూడా అందలేదట. కరోనా నేపథ్యంలో పేదలు ఇబ్బంది పడకూడదని ప్రభుత్వం కుటుంబానికి 1500 రూపాయలు అందజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కాకపోతే ఇప్పటికీ కొన్ని ఊర్లలో ఆ డబ్బులు అందలేదని కొందరు తెలిపారు. అంతేకాకుండా చాలా గ్రామాల్లోని చాలామందికి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన డబ్బు కూడా అందలేదట. దానితోపాటు జన్ ధన్ ఖాతాలు ఉన్న వారికి కూడా డబ్బులు జమ అవ్వలేదట.


ప్రస్తుతం మొక్కజొన్న పంట చేతికి వచ్చిందని అయితే ఆ పంటను నిల్వ చేయడానికి ఎలాంటి గోదాములు కూడా అందుబాటులో లేవని, అంతేకాకుండా ఆ ప్రాంతంలో కూరగాయలు, మొక్కజొన్న, మైసూర్ పప్పు ఇలా పండిస్తారని తెలిపారు. అంతేకాకుండా ఆ ప్రాంతంలో పువ్వుల ఉత్పత్తి కూడా ఎక్కువగా జరుగుతుందట. అయితే వీటిని అమ్ముకోవడానికి రైతులు నానా అవస్థలు పడుతున్నారు. కరోనా వైరస్ పల్లె ప్రాంతాల్లో ఎక్కువగా లేకపోయినా రెడ్ జోన్ మాదిరిగా అక్కడ నిబంధనలను వారు పాటిస్తున్నారు. దీనితో అక్కడ జీవనం సాధారణ స్థితికి వచ్చేసరికి వస్తే తప్ప ఇబ్బందులు తొలగవని అక్కడి పరిస్థితి ఉంది. ఇక త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని గ్రామీణ ప్రాంత వాసులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: