ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నాయి అనే చెప్పాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అయితే రోజురోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య అత్యధికంగా నమోదు అవుతున్నాయి. ఇక రాష్ట్రంలో గత 24 గంటల్లో 8263 శాంపిల్స్ పరీక్షలు నిర్వహించగా 67 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారించడం జరిగింది. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 1717 పాజిటివ్ కేసులు నమోదు అవ్వగా 589 మంది డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. 

 


ఇక రాష్ట్రంలో మొత్తంగా 34 మంది కరోనా బారినపడి మృత్యువాత పడ్డారు. ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు యాక్టీవ్ గా పాజిటివ్ కేసుల సంఖ్య 1094 గా ఉంది. ఇక అత్యధికంగా కర్నూలు జిల్లాలో పాజిటివ్ కేసులు సంఖ్య నమోదు అవుతూ వస్తుంది. గడిచిన వారం రోజులుగా గమనిస్తూ ఉంటే కర్నూలు జిల్లాలో ప్రతిరోజు కూడా ఇరవై పాజిటివ్ కేసుల సంఖ్య కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి.  దీనితో ఇప్పటివరకు కర్నూలు జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 516 కు చేరుకుంది. ఇక కర్నూల్ తర్వాత స్థానంలో గుంటూరు జిల్లాలో అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఇక తాజాగా విడుదలైన ప్రకారం 355 కేసులు నమోదు అయ్యాయి. మూడవ స్థానంలో కృష్ణాజిల్లా 286 కేసులు నమోదయ్యాయి. దీనితో ఈ మూడు ప్రాంతాలలో కూడా అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురి చేస్తుంది. ఇక జిల్లా వారిగా పాజిటివ్ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.. 

 


అనంతపూర్ 80,  
చిత్తూర్ 82 
ఈస్ట్ గోదావరి 45 
గుంటూరు 351 
కడప 89  
కృష్ణ 286 
కర్నూల్ 516
నెల్లూరు 92 
ప్రకాశం 61, 
 శ్రీకాకుళం 5,  
విశాఖపట్నం 37, 
విజయనగరం 0,
వెస్ట్ గోదావరి 59,

మరింత సమాచారం తెలుసుకోండి: