కరోనా ప్రభావం ఎక్కడ తగ్గక పోవడంతో లాక్ డౌన్ ను మరింత పొడిగింపు చేస్తూ సంచలన నిర్ణయాలను తీసుకున్నారు.. అదేంటంటే మే 17 వరకు లాక్ డౌన్ ను కొనసాగించనున్నట్లు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చెప్పుకొస్తున్నారు.. ఇకపోతే కరోనా నుంచి ప్రజలు తమను తాము కాపాడుకోవడానికి సినీ రాజకీయ నాయకులు ముందుకొస్తున్నారు.. 

 

 

 

 

 

 

 

కరోనా మహమ్మారిని ఇంట్లోనే ఉంటూ కట్టడి చేయాలని చాలా మంది అనుకుంటున్నారు..అయితే ఈ మేరకు సినీ ప్రముఖులు కూడా అభిమానులకు సూచనలు ఇస్తూ ప్రజలను ఆకర్షించడానికి సోషల్ మీడియాలో వీడియోలను పోస్ట్ చేస్తూ వస్తున్నారు.. అయితే లాక్ డౌన్ తప్పక పాటిస్తే ఎటువంటి భాధలు ఉండవని తెలియ పరుస్తున్నారు.. 

 

 

 

 

 

 

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య ఒకరోజు పెరగడం, మరోరోజు తగ్గతున్న నేపథ్యంలో లాక్ డౌన్ ను మరికొన్ని రోజుల పాటు పొడిగించే ఉద్దేశంలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ సూచన మేరకు ప్రభుత్వం ఈ దిశగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది..

 

 

 

 

 

 

 

ఈ మేరకు వైరస్ ను అదుపు చేసేందుకు కనీసం 70 రోజుల లాక్ డౌన్ అవసరమని, రాష్ట్రంలో ఇంకొన్ని రోజులు లాక్ డౌన్ పొడిగించడం మంచిదని ప్రభుత్వానికి ఆరోగ్య శాఖ అధికారులు సిఫారసు చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 28 వరకు లాక్ డౌన్ పొడిగించే ఉద్దేశంలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే అన్నీ సంస్థలు మూత పడటంతో నష్టాలు చవి చూశాయి.. ఇప్పుడేమో మరో డెబ్బై రోజులు పెంచితే ఇంక డబ్బులు అనే మాటలను పుస్తకాల్లో చదవాల్సి వస్తుందని సదరు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు...

 

మరింత సమాచారం తెలుసుకోండి: