కరోనా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది..కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు.. కుల మతాలకు అతీతంగా పేదలకు  సాయం చేయడంలో ముండుకొస్తూ మరో సారి భారత దేశం సకల మత సమ్మేళనం అని నిరూపించింది ..  దేశ వ్యాప్తంగా మే 17 వరకు లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉంటూ కరోనా సోకకుండా జాగ్రత్తలు పాటించాలని సినీ రాజకీయ ప్రముఖులు సూచించారు..

 

 

 

 

 

అయితే కరోనా వచ్చిందని అందరూ కరోనా భారీన పడాలని చాలా మంది అనుకుంటారు.. మనిషి స్వార్థానికి ఇప్పుడు బ్రతుకుతున్నారు.. కరోనా నుంచి ప్రజలను కాపాడటానికి పోలీసులు, డాక్టర్లు, పారిశుధ్య కార్మికులు కష్టపడుతున్నారు..  అయితే తమిళ నాడులో కొందరు మాత్రం కరోనా ను ఇంకా పెంచాలని చూస్తున్నారు..

 

 

 

 

 

తమిళనాడు రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి కుట్ర జరుగుతున్నట్లు సోషల్ మీడియాలో పుకార్లు గుప్పుమంటున్నాయి. చెన్నై పురసైవాక్కం, వెస్ట్‌ మాంబళం, మాధవరం తదితర ప్రాంతాల్లో రాత్రి వేళల్లో ఇళ్ల ముందు కరెన్సీ నోట్లు విసిరేయడం ఇపుడు సంచలనం సృష్టిస్తుంది. మాధవరం పాలకొట్టం సమీపంలోని కేకే తాళై మాణిక్యం వీధిలో మే 2వ తేదీన  రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు సైకిళ్లపై సంచరించి పరిసరాల్లోని ఇళ్ల ముందు రూ.20, రూ.50, రూ.100 కరెన్సీ నోట్లను విసిరిపోయారు. అయితే వీరిపై అనుమానం వచ్చిన   స్థానికులు వారిని పట్టుకునేందుకు యత్నించగా పారిపోయారు.

 

 

 

 

 

కాగా కరోనా   ప్రజలు ఎవ్వరూ ఆ నోట్లను తాకలేదు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో విషయం పోలీసుల ద్రుష్టికి చేరింది. దీంతో సీసీటీవీ కెమెరాల పుటేజీ సహాయంతో వారికోసం గాలిస్తున్నారు. కాగా వారు డబ్బులు ఎందుకు చల్లారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐతే కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వైరస్‌ ప్రబలుతున్నట్లు ఇంతవరకు నిర్ధారణ కాకున్నా... ఇలాంటి చర్యలు అనేక అనుమానాలకు తావిస్తోంది. మిగితా విషయాలు తెలియాల్సి వుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: