ప్రస్తుతం దేశంలో లాక్ డౌన్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే మే 4వ తారీఖు నుంచి కొన్ని రాష్ట్రాల్లో కొన్నిటికి మినహాయింపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో తెలంగాణ మినహాయించి కొన్ని రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు తెరవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. దీనితో నిన్నట రోజున దేశంలో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. 


సామాజిక దూరం పాటిస్తూ ఈ మందును కొనాలని ప్రభుత్వం సూచించినప్పటికీ అది ఎక్కడ కనబడలేదు అని చెప్పవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే దాని గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. దీనికి కారణం నిన్న జరిగిన అనేక చోట్ల సంఘటనలే. కరోనా వస్తుందన్న భయం లేకుండా ఒకరిమీద ఒకరు పడుతూ మద్యాన్ని కొనుగోలు చేశారు. దీనితో ప్రభుత్వం పై అనేక మంది సెటైర్లు వేశారు అనుకోండి. అయితే ఇక నిన్న ఒక్క రోజునే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం అమ్మకాలకు 40 కోట్లు ఖజానాకు చేరింది. అయితే ఈ డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలు ఏకంగా 50 శాతం పెంచిన సంగతి విధితమే.


అయితే ఇక ఏ బాటిల్ పై ఎంత పెంచారు ఒకసారి ఇటు చూడండి... అడిషనల్ రిటైల్ ఎక్సైజ్ టాక్స్ పేరిట మద్యం ధరలు పెంచింది. ఇక రూ. 120 బ్రాండ్ మద్యం పై క్వార్టర్ కు రూ. 40 పెంచారు. హాఫ్ బాటిల్ పై 80, ఫుల్ బాటిల్ పై 160 రూ., 120-150 ధరలు ఉన్న మద్యంపై క్వార్టర్ పై రూ.60, హాఫ్ పై రూ.120, ఫుల్ పై రూ.320 పెంచారు. అలాగే రూ.150 కంటే ఎక్కువ ఉన్న మద్యం బ్రాండ్స్ పై క్వార్టర్ పై రూ.120, హాఫ్ పై రూ.240 ఫుల్ పై రూ. 480 పెంచారు. ఇంకా మినీ బీర్లపై రూ.40, బీర్ బాటిల్ పై రూ.60 పెంచింది ఏపీ సర్కార్.  నిజానికి ప్రభుత్వం ఇంకా పెంచిన మందుబాబులు కొంటునే ఉంటారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: