పశ్చిమ గోదావారి జిల్లా అంటే కేవలం పచ్చని పాడి పంటలకి నెలవు మాత్రమే కాదు. రాజకీయాలకి కేంద్ర బిందువు కూడా. ఆంధ్రా రాజకీయాలు మొత్తం ఈ జిల్లా చుట్టే తిరుగుతూ ఉంటాయి. ఎంతో మంది రాజకీయ ఉద్దండులని అందించిన జిల్లా పశ్చిమ గోదావారి జిల్లా. ఓ పార్టీ గెలుపు ఓటములని సైతం ఈ జిల్లా డిసైడ్ చేస్తుందంటే అతిశయోక్తి కాదు. అలాంటి ఈ జిల్లాలో “మంచెం మై బాబు” అనే యంగ్ వైసీపీ లీడర్ సెంటరాఫ్ అట్రాక్షన్ నిలుస్తున్నారు..ఏలూరు మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ గా ఉన్నతమైన పదవిలో ఉన్నా సాధారణ వ్యక్తిగా రైతులకి సేవలు అందిస్తున్న ఈ యంగ్ లీడర్ పశ్చిమ రాజకీయాల్లో దూసుకెళ్తున్నాడు..

“మంచెం మై బాబు” పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా రైతులకి ఎంతో సుపరిచితుడు. ప్రస్తుతం ఆసియాలోనే  అతిపెద్ద నిమ్మకాయల మార్కెట్ అయిన ఏలూరు మార్కెట్ యార్డ్ కు   ఛైర్మెన్ గా  నియమితులు అయ్యారు. గతంలో ఇదే మార్కెట్ యార్డ్ కి డైరెక్టర్ రెండు సార్లు,  వైస్ చైర్మెన్ గా భాద్యతలు నిర్వర్తించారు. దాంతో ఏపీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని మై బాబు సేవలని గుర్తించి అదే మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ గా జనవరి 2020 లో అవకాశాన్ని కల్పించారు. డిగ్రీ మొదటి సంవసత్సరం చదువుతున్న రోజుల్లోనే  జిల్లా తెలుగు విద్యార్ధి అధ్యక్షుడిగా మై బాబు ఎన్నికయ్యారు. విద్యార్ధి నాయకుడిగా, తెలుగు విద్యార్ధి అధ్యక్షిడిగా పనిచేసిన మై బాబు 2009 లో  ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ళ నాని పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మై బాబు ని అప్పటి ముఖ్యమంత్రి  వైఎస్ రాజశేఖర్ రెడ్డి కండువా కప్పుతూ “ మై బాబు యు అర్  మై బాబు అంటూ సంభోదిస్తూ పార్టీలోకి ఆహ్వానించడం అందరిని ఆశ్చర్య పరిచింది.

వైఎస్ మరణాంతరం జగన్ మోహన్ రెడ్డి పార్టీ ఏర్పాటు చేసిన తరువాత ఆళ్ళ నాని వైసీపీలో చేరడంతో మై బాబు కూడా నాని బాటలోనే నడిచారు. ఆళ్ళ నానితో పరిచయం మొదలు ఇప్పటి వరకూ కష్టమైనా నష్టమైన  మైబాబు నాని తో ఉన్న స్నేహాన్ని వదులుకోలేదు. 2009 లో కాంగ్రెస్ హాయంలోనే ఏలూరు రూరల్ పార్టీ మండల అధ్యక్షుడు గా పనిచేసిన మై బాబు వైసీపీలో చేరిన తరువాత కూడా అదే పదవిలో ఇప్పటి వరకూ కొనసాగుతున్నారంటే  మైబాబుకి ఉన్న చరిష్మా ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. ఇదిలాఉంటే

2014 లో వైసీపీ పరాజయం పొందిన తరువాత ఎంతో మంది పార్టీకి ,ఆళ్ళ నానికి దూరంగా ఉన్నా మై బాబు మాత్రం నానికి వీర విధేయుడిగా కొనసాగారు. ఏలూరు నియోజకవర్గంలో పార్టీకి పునర్వైభవం తీసుకురావడానికి, ఆళ్ళ నానిని మళ్ళీ గెలిపించడానికి  మై బాబు చేసిన  కృషి అంతా ఇంతా కాదు. ఈ క్రమంలోనే టీడీపీ ప్రభుత్వం చేసిన కక్ష పూరిత చర్యలని సైతం ఎదుర్కున్న మై బాబు అదరలేదు.. బెదరలేదు. ఆళ్ళ నాని గెలుపే లక్ష్యంగా నిరంతరం ప్రజలలో ఉంటూ ప్రజా మద్దతు కూడ గట్టారు. సభలు, సమావేశాలు, నిర్వహిస్తూ ఎంతో చురుకుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించే వారు.

దాంతో 2019  ఎన్నికల్లో ఆళ్ళ నాని గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఇదిలాఉంటే  స్వతహాగా వ్యవసాయ కుటుంభం కావడంతో రైతుల కష్టాలని నేరుగా చూసిన అనుభవం ఉన్న మై బాబు మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ గా రైతులకి లాభం చేకూర్చేలా ఏదన్నా చేయాలని తపించారు..మార్కెట్ యార్డ్ లో సమూలమైన మార్పులు తెచ్చే విధంగా ప్రక్షాళణ చేయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే మైబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు...

మార్కెట్ యార్డ్ లో ఎవరైనా వ్యాపారం చేయాలంటే ఆ వ్యాపారస్తుడు  62 లక్షలు కడితేనే గానీ మార్కెట్ యార్డ్ లోకి అనుమతి ఉండేది కాదు..ఈ విధానాన్ని పూర్తిగా మార్చేశారు. ఛైర్మెన్ గా ప్రమాణ స్వీకారం చేసిన 21 రోజుల్లోనే ఆళ్ళ నాని సూచనల మేరకు వాలంటరీ ట్రేడ్ విధానాని అమలు చేశారు. దాంతో కేవలం 25 వేలు కట్టిన వారికి కూడా సభ్యత్వం ఇచ్చి 62 లక్షలు కట్టిన వారికి ఎలాంటి సౌకర్యాలు ఇస్తారో అన్ని రకాలుగా వారికి అవకాశాలు కల్పించారు. వారికి ప్రత్యేకమైన షెడ్స్ ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకూ ఈ విధానం అమలు అయ్యింది కేవలం ఏలూరు మార్కెట్ యార్డ్ లో మాత్రమే. ఈ యార్డ్ ద్వారా  ప్రతీ రోజు 1500 ల  నుంచీ 2000 వరకూ ఉపాది పొందుతున్నారు.

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని ఆదేశాల మేరకు కరోనా లాంటి మహమ్మారి సమయంలో రైతులు నష్ట పోకూడదని నిమ్మ రైతులు ఇబ్బందులు నష్ట పోకుండా మై బాబు చేపడుతున్న చర్యలు రాజకీయ ఉద్దండులని సైతం ఆశ్చర్య పరుస్తున్నాయి. నిత్యం ఏలూరు మార్కెట్ యార్డ్ ని డ్రోన్స్ సాయంతో పూర్తిగా శానిటైజేషన్ చేసేలా చర్యలు చేపడుతున్నారు. రైతు బజార్లలో అధిక ధరలకి కూరగాయలు అమ్మకుండా చర్యలు తీసుకునే క్రమంలో  రైతు బజార్లలో ప్రతీ రోజు తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిత్యం రైతులతో పాటు మార్కెట్ యార్డ్ లోనే గడుపుతూ మార్కెట్ లో అవకతవకలు లేకుండా రైతులకి అన్యాయం జరగకుండా ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. 

ఏలూరు మార్కెట్ యార్డ్ లో రైతులకి వ్యవసాయ నూతన విధాన పద్దతులపై అవగాహన కొరకు ట్రైనింగ్ ఆడిటోరియం ఏర్పాటు చేయాలని, అరటి పండ్లు రసాయనిక పద్దతిలో కాకుండా సహజ సిద్దంగా పండించేలా రిఫైనింగ్ చాంబర్ నిర్మిచడానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. నన్ను  నమ్మి మార్కెట్ యార్డ్ చైర్మెన్ గా నియమించిన ఆళ్ళ నాని గారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పే మై బాబు. ఏలూరు పరిసర ప్రాంత ప్రజలకి ఎలాంటి కష్టం వచ్చినా తనవంతు సాయం చేస్తూ ఉంటారు. రాజకీయాల్లో నన్ను వేలు పట్టి నడిపించింది ఆళ్ళ నాని గారేనని రాజకీయాల్లో ఉన్నంత వరకూ నాని గారి వెంటే నడుస్తానని చెప్పే మై బాబు. నాని ఆశీస్సులతో పశ్చిమ రాజకీయాల్లో దూసుకెళ్తున్నాడు...

మరింత సమాచారం తెలుసుకోండి: