దేశంలో లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి మందుకోసం అల్లలాడిని మందు బాబులు నిన్నటి నుంచి ఊపిరి పీల్చుకుంటున్నారు.  సాయంత్రం అయితే సుక్క పడితే కానీ ఇంటికి వెళ్లని ఎంతో మంది మందుబాబులు గత నలభై రోజుల నుంచి మద్యం లేక విల విలలాడిపోయారు.  ఇక  నిన్నటి నుంచి గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మద్యం షాపులు తెరుచుకున్న విషయం తెలిసిందే. మద్యం షాపుల ముందు మద్యం ప్రియులు బారులు తీరారు. షాపుల ముందు జనం భారీగా క్యూ కట్టారు. సోషల్ డిస్టెన్స్ పాటించకపోవడంపై ప్రజల నుంచి పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మొన్నటి వరకు ఇంట్లో ప్రశాంతంగా ఉన్న కుటుంబ సభ్యులు ఇప్పుడు మళ్లీ కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇలా మద్యం దుకాణాలు తెరిచిన తొలిరోజులోనే ఎన్నో కుటుంబాల్లో చిచ్చు రేపింది. పలు చోట్ల ప్రాణాలు కూడా బలితీసుకుంది.

 

చిత్తూరు జిల్లా పలమనేరులో మద్యానికి బానిసైన వ్యక్తి భార్య, కూతురును తీవ్రంగా కొట్టడంతో వారిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు.  గత కొన్ని రోజులుగా మద్యం కోసం ముఖం వాచి పోయిన మందుబాబులు బాగా తాగడంతో తమను తాము మర్చిపోయి.. మృగాళ్లలా మారుతున్నారని ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్న చొక్కలింగం అనే వ్యక్తి  ఫుల్లుగా మద్యం సేవించి ఇంటికి వచ్చి  మత్తులో భార్య జగదాంబపై చేయి చేసుకున్నాడు. మనస్థాపం చెందిన తల్లి కూతుళ్లు ఉరివేసుకున్నారు. 

 

కృష్ణా జగ్గయ్యపేటలో మందుబాబులు రెచ్చిపోయారు.. కన్నూమిన్నూ తెలియకుండా వాహనాన్ని నడిపి ఓ వృద్దురాలిని ఢీ కొట్టారు..దాంతో ఆమె తీవ్ర గాయాలపాలైంది.  దీంతోముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక నెల్లూరు లో  బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు ప్రమాదానికి గురయ్యారు. కోడూరు పాతాళెంకు చెందిన యాదాద్రి (24) మద్యం మత్తులో బైక్ నడుపుతూ చెట్టుకు ఢీ కొన్నాడు.  యాదాద్రి అక్కడిక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.  యాదాద్రి పెళ్లి కూడా నిశ్చయం అయ్యింది.. ప్రస్తుతం ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: