ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా  వైరస్ ప్రభావం పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపులు  చేసిన విషయంలో తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మద్యం అమ్మకాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. దాదాపు దాదాపు 40 రోజుల తర్వాత మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో ప్రజలందరూ మద్యం దుకాణాల వద్ద బారులు తీరారు. ఏ మద్యం దుకాణం వద్ద చూసినా ప్రస్తుతం ప్రజలు పెద్ద ఎత్తున కనిపిస్తున్నారు. ఇక కొన్నిచోట్ల అయితే సామాజిక దూరాన్ని కూడా పాటించడం లేదు ప్రజలు. గుమిగూడి   ఎగపడుతూ మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. 

 

 

 అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ప్రారంభించడం పై జగన్ సర్కార్ పై పలు విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు  అయితే మద్యం షాపుల అంశాన్ని టార్గెట్ చేస్తూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లాక్ డౌన్  సడలింపు లో భాగంగా ఆంధ్రప్రదేశ్ సర్కార్ చేపట్టిన మద్యం అమ్మకాల కోసం... మద్యం దుకాణాల వద్ద ఉపాధ్యాయులను ఉంచడం నిజంగా శోచనీయం అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. 

 

 విద్యాబుద్ధులు నేర్పి భావిభారత పౌరులను తీర్చిదిద్దే గురుదేవులకు ప్రభుత్వం ఇలాంటి విధులు అప్పగించడం ఏమిటి అంటూ ప్రశ్నించారు. ఈరోజు చిత్తూరులోని జిల్లా నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ... కరోనా వైరస్ పై అవగాహన కల్పించడం నిత్యావసరాల పంపిణీ చేయడం పేదలకు ఆహారం పంచటం  లాంటి వాటి విషయంలో ఉపాధ్యాయుల ను ఉపయోగించి ఉంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజలందరూ ఆలయాలు మసీదులకు వెళ్లకుండా... ఎలాంటి పండగలు జరుపుకోకుండా  నిబద్ధతతో కరోనా  వైరస్ పై పోరాటం చేస్తుంటే ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంగా మద్యం దుకాణాలు తెరవడం దారుణం అంటూ వ్యాఖ్యానించారు. ఇంతకాలం పాటించిన లాక్ డౌన్  స్పూర్తిని జగన్ సర్కార్ మద్యం షాపులు తెరిచి మంటగలిపింది  అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్.

మరింత సమాచారం తెలుసుకోండి: