ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్  యాప్ లు వాడుకలో చాలానే ఉన్నాయి.. అందులో ఫోన్ పే దూసుకెళ్తోంది.. ప్రజల వినియోగ దృష్ట్యా కొత్త సర్వీసులను అమలులోకి తీసుకొచ్చింది..వివరాల్లోకి వెళితే.. అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్‌కు చెందిన డిజిటల్ పేమెంట్స్ సంస్థ ఫోన్‌పే తాజాగా తన కస్టమర్లకు తీపికబురు అందించింది. కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చింది. సూపర్ ఫండ్స్ పేరుతో ఈ సేవలను లాంచ్ చేసింది. 

 

 

 

 

 

ఇందులో భాగంగా కస్టమర్లు ఈక్విటీ, గోల్డ్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. తద్వారా దీర్ఘకాలంలో మంచి రాబడి పొందొచ్చు. ఫోన్‌పే తాజా సర్వీసులతో పేటీఎంకు షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అంతేకాదండోయ్..ఫోన్‌పే తాజా కొత్త సర్వీసుల కోసం ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ సంస్థలో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ‘సూపర్ ఫండ్స్‌ ద్వారా 20 కోట్ల మంది ఫోన్‌పే యూజర్లు దీర్ఘకాంలో సంపద సృష్టించుకోవచ్చు. ఈక్విటీ, బంగారం, డెట్ మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. 1000కి పైగా టాప్ ఫండ్ ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయని ఆయా యాజమాన్య సంస్థ వెల్లడించింది.

 

 

 

 

ఫోన్ పే వినియోగదారులు ఇన్వెస్టర్ గా మారి సంబంధిత ఫండ్స్ ను ఎంచుకోవచ్చు..తర్వాత ఆదిత్య బిర్లా ఫండ్‌కు చెందిన ఫండ్ మేనేజర్లు మిగతా పని చూసుకుంటారు. మీ ఇన్వెస్ట్‌మెంట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారు. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ ఫండ్ వ్యాల్యూను తగ్గకుండా చూసుకోవడానికి ప్రయత్నిస్తారు.

 

 

 

 

మరో విషయమేంటంటే..డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి ముందుగా ఫోన్‌పే యాప్‌లోకి వెళ్లి మై మనీ సెక్షన్‌లోకి వెళ్లాలి. అందులో సూపర్ ఫండ్స్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఫోన్‌పే‌తో భాగస్వామ్యం వల్ల ఇరు సంస్థలకు ప్రయోజనం కలుగుతుందని ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ ఎండీ, సీఈవో బాల సుబ్రమణియమ్ తెలిపారు. అలాగే అతి చిన్న అమౌంట్ అంటే 500 నుంచి యూజర్లు మనీ ఇన్వెష్ట్  చేయొచ్చు నట..

 

మరింత సమాచారం తెలుసుకోండి: