క‌రోనా క‌ల‌క‌ల స‌మ‌యంలో అంతా సంయ‌మ‌నం పాటిస్తున్నారు. ఈ మ‌హ‌మ్మారితో జ‌నాలు ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకుంటుంటే.. కొంద‌రు మాత్రం త‌మ అతిని చాటుకుంటున్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కూడా కరోనా మహమ్మారి వల్ల ప్రాణ నష్టం కలగకుండా తగు జాగ్రత్తులు తీసుకుంటున్నాయి. దేశంతో పాటు అన్ని రాష్ట్రాలు కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉన్న తరుణంలో అలా అతి ప్ర‌ద‌ర్శించిన ఓ ఘ‌ట‌న ఏపీలో కొద్దికాలం క్రితం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని హేళన చేస్తూ ఓ మహిళా హోంగార్డ్ సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు షేర్ చేయ‌డం, దీన్ని గుర్తించిన అధికారులు ఆమెను అరెస్టు చేయ‌డం తెలిసిన సంగ‌తే. ఇప్పుడు స‌రిగ్గా ఇలాంటి చ‌ర్యలే బీజేపీ నేత‌లు తీసుకున్నారు.

 


వివ‌రాల్లోకి వెళితే...ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఓ కానిస్టేబుల్‌ను యూపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీహార్‌ నలందలో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్‌ తన్వీర్‌ ఖాన్‌ను యూపీ సీఎంపై వివాదాస్ప‌ద కామెంట్లు చేశాడు. ఘాజిపూర్‌ జిల్లాలో ఆజాన్‌కు యోగి అనుమతివ్వడం లేదని, అతను చనిపోవాలని కోరుకుంటున్నానని తన్వీర్‌ ఖాన్‌ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు‌. ఈ  కానిస్టేబుల్ కామెంట్ల‌ను కొంద‌రు నెటిజన్లు బీజేపీ నేత‌ల‌కు, యూపీ పోలీసులకు ఫార్వార్డ్‌ చేశారు. తన్వీర్‌ ఖాన్‌ పోస్టు చేసిన వ్యాఖ్యల ఆధారంగా ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. దేశద్రోహం కింద తన్వీర్‌ ఖాన్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 

ఇదిలాఉంగా, ఏపీలో ఓ మ‌హిళా హోంగార్డు ఇదే రీతిలో ఇబ్బందుల పాలైన సంగ‌తి తెలిసిందే. ఏలూరులోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా పని చేస్తున్న న‌ర్రా ప్రవీణ చౌదరి, ఆమె భర్త నర్రా గోపీ కృష్ణ చౌదరిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ప‌లు అసభ్యకర  పోస్టుల‌ను వాట్సాప్, ఫేస్‌బుక్‌లో షేర్ చేసారు. దీంతో అవి వైరల్‌గా మారాయి. కొన్ని వేల మంది ఆ పోస్టులను ట్రోల్ చేస్తూ రిప్లై లు పెట్టారు. ఇక అవి కాస్తా అధికారుల దృష్టికి చేరడంతో పోలీసులకు ఫిర్యాదు అందింది.  దీంతో ఆ దంప‌తుల‌ను అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: