ప్రపంచ వ్యాప్తంగా కరోనా భయం పట్టుకుంది. ఎటు చూసిన కూడా కరోనా మాటనే వినపడుతుంది..రోజు రోజు కూ కరోనా వల్ల చాలా మంది మృత్యువాత పడుతున్నారు.. మరీ కొందరు మాత్రం కరోనా కారణంగా  క్వారంటైన్ లో బాధపడుతున్నారు.. ఇకపోతే కరోనా కట్టడి లో భాగంగా ప్రభుత్వం లాక్ డౌన్ పేరుతో ప్రజలను ఇళ్లకే పరిమితం అయ్యేలా చేసింది.. అయినా కూడా కరోనా ప్రభావం ఎక్కడా తగ్గలేదు.. 

 

 

 

 

కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు.. కుల మతాలకు అతీతంగా పేదలకు  సాయం చేయడంలో ముండుకొస్తూ మరో సారి భారత దేశం సకల మత సమ్మేళనం అని నిరూపించింది ..  దేశ వ్యాప్తంగా మే 17 వరకు లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉంటూ కరోనా సోకకుండా జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు. 

 

 

 

 

మళ్లీ వైరస్ తీవ్రత పెరుగుతుందనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. కరోనా వైరస్ కేసులు లక్ష దాటడానికి 67 రోజు పడితే, రెండో లక్ష 11 రోజుల్లోనూ, మూడో లక్ష నాలుగు రోజుల్లోనే చేరింది. ప్రస్తుతం రోజుకు సగటున లక్ష మంది వైరస్ బారినపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 35.66 లక్షల మంది కరోనా వైరస్ బారినపడగా... వీరిలో 248,286 మంది చనిపోయారు. అలాగే, వైరస్ నిర్ధారణ అయినవారిలో 1,154,057 మంది కోలుకున్నారు. మరో 21 లక్షల మంది పరిస్థితి నిలకడగా, 50,00 మంది పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉంది.

 

 

 

అన్నీ దేశాలతో పోలిస్తే అమెరికాలో కరోనా మరణాల సంఖ్యా కాస్త ఎక్కువగానే ఉందన్న విషయం తెలిసిందే.. ఇప్పటి వరకూ దాదాపు 12 లక్షల మంది వైరస్ బారినపడిగా.. 68,598 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, బ్రిటన్‌లో కొత్త కేసులు, మరణాలు తగ్గుముఖం పట్టాయి. ఇన్నాళ్లూ రోజుకు సగటున 700 వరకు మరణాలు నమోదు కాగా.. రష్యాలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 134,687కి చేరింది. జర్మనీలో కొత్తగా 793 మందికి కరోనా సోకింది.. ఇలా మొత్తానికి చూసుకుంటే మృతుల సంఖ్య 2లక్ష్యలు దాటింది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: