ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ నేతృత్వంలో ప్రభుత్వం మందుబాబులకు మొదటి నుండి షాకుల మీద షాకులు ఇస్తూనే ఉంది. తాజాగా మరో షాక్ ఇచ్చింది. కేంద్రం మార్గదర్శకాల నేపథ్యంలో సోమవారం నుండి మద్యం అమ్మకాలను ప్రారంభించిన ప్రభుత్వం ధరలను 25 శాతం పెంచడం జరిగింది. అయితే మందుబాబులు పెరిగిన ధరలు కూడా పెద్దగా పట్టించుకోకుండా మందుబాబులు భయంకరంగా రోడ్లపైకి రావడంతో ఏపీ ప్రభుత్వం ఆగ్రహం చెందింది. దీంతో మద్యం బాబులకు నిరుత్సాహపరిచే భాగంగా మరో 50 శాతం మేర ధరలు పెంచడంతో మందుబాబులకు దిమ్మతిరిగిపోయింది.

 

జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయానికి మందుబాబులు కొనటానికి ఆపసోపాలు పడుతున్నారు. మద్యం దుకాణాలు వల్ల మందు బాబులు ఎగబడే పరిస్థితి రావడంతో వారిని నిరుత్సాహ పరచడం తో పాటు భారీగా ఆదాయం ఆర్జించడానికి టార్గెట్ పెట్టుకున్నట్లు అర్థమవుతుంది. దీంతో చాలావరకు మందు బాబులు చచ్చిపోయినా పరవాలేదు .. ఒక క్వార్టర్ వేసి చచ్చిపోతామ్ ధరలు తగ్గించండి అయ్యా అంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మొత్తంమీద చూసుకుంటే 75% లిక్కర్ పై రేట్లు పెరిగినట్లు అర్థమవుతుంది. పెంచిన ధరలు అమలులోకి తీసుకు రావడంతో చాలావరకు మందుబాబులు కొనలేని పరిస్థితి ఏర్పడింది.

 

వైయస్ జగన్ ఎన్నికల టైంలో రాష్ట్రంలో ప్రతి కుటుంబాన్ని మరియు మహిళలను ఏడిపిస్తున్న మద్యపానాన్ని తన హయాంలో పూర్తిగా రద్దు చేసే విధంగా అడుగులు వేస్తున్నట్లు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే అధికారంలోకి రావడంతో ఆ దిశగానే జగన్ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అయితే ఇటీవల కరోనా వైరస్ రావటంతో దేశవ్యాప్తంగా మందు షాపులు 60 రోజులపాటు క్లోజ్ అవటంతో ఒక్కసారిగా పర్మిషన్ రావడంతో మరింతగా ధరలు పెంచేశారు జగన్. దీంతో మందుబాబులకు నిరుత్సాహం కలిగే విధంగా వాళ్ల ఆలోచనల్లో మార్పు వచ్చే విధంగా జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైసీపీ పార్టీలో టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: