జగన్ అంటే ఫైర్. ఆయన అనుకున్నది సాధించేందుకు పదేళ్ళ పాటు చేసిన పోరాటం కళ్ళ ముందు ఉంది. జగన్ నాయకత్వం చాలా మందికి స్పూర్తి. ఇక జగన్ వ్యక్తిత్వం కూడా చాలా గొప్పది. ఇచ్చిన మాటకు కట్టుబడి ఎందాకైనా అనే వారు వర్తమానంలో ఎవరూ లేరు. అలాంటి జగన్ని గుండెల్లో పెట్టుకుని జగన్ భారీ మెజారిటీతో గెలిపించారు.

 

జగన్ కి పాలనానుభవం లేదన్నారు. కానీ ఎన్నో కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని తనదైన  శైలిలో ఒడ్డున పడేసేందుకు సర్వదా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.  ఓ వైపు విభజన గాయాలు ఏపీని పట్టిపీడిస్తున్నాయి. మరో వైపు నిధులు భారిగా ఇచ్చి ఆదుకునే దిక్కు లేదు. ఇవన్నీ ఇలా ఉంటే కరోనా మహమ్మారి ప్రపంచం మీద పడింది. దాని ప్రభావం అందరికంటే కూడా ఏపీకే ఎక్కువ. కనీసం చిల్లిగవ్వ కూడా చేతిలో లేదు.

 

ఇదీ ఏపీ పరిస్థితి. సరే లాక్ డౌన్ సడలింపు తరువాత ఏపీలో మద్యం దుకాణాలను తెరవడం కొంత విమర్శలకు దారి తీసింది. అయితే మధ్యం ద్వారా ఆదాయం తెచ్చుకుంటారా అన్న ప్రశ్నకు జగనే కాదు, దేశం మొత్తం సమాధానం చెప్పాలి. ఆ మాటకు వస్తే మద్యం దుకాణాలు తెరవవచ్చు అని సడలింపు ఇచ్చింది కేంద్రం.

 

మరి కేంద్రాన్ని అనడం మానేసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కేవలం  జగన్నే టార్గెట్ చేయడమేంటో అర్ధం కాదు. ఇక రేపో మాపో తెలంగాణాలో కూడా మద్యం దుకాణాలు తెరుస్తారని టాక్. మరి దాని మీద కేసీయార్ని వద్దు అని చెప్పగలరా. మోడీని  ఎందుకిలా చేశారని నిలదీయగలరా. 

 

అబ్బే అవేం చేయలేరు. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే కరోనా వీర విహారం చేస్తున్నా కూడా  తీరికూర్చుని జగన్నే ఆడిపోసుకుంటారు. ఎందుకంటే జగన్ తిరిగి సమాధానం చెప్పడు, ఆయన తన పనేదో తానేదో అన్నట్లుగా ఉంటాడు. అందుకే జగన్ అంటే అంత అలుసు. కేసీయార్ ఒక్క హెచ్చరికతో అక్కడ ఒక మీడియా అధిపతి కళ్ళు పచ్చబారాయి. కంప్లీట్ సైలెంట్ అయ్యారు. అదే మీడియాలో  ఆయన తెల్లారిలేస్తే జగన్ మీద పూనకాలతో రాతలు రాస్తాడు. 

 

ఎందుకంటే జగన్ ఏమీ అనడు కాబట్టి. తెలంగాణాలో కేసులు తక్కువ చూపిస్తారు అని అక్కడ మిగిలిన పక్షాలు విమర్శలు చేస్తూంటే ఇదే చంద్రబాబు, పవన్ మాత్రం దాని మీదా అసలు  మాట్లాడరు, ఎందుకంటే వారికి ఏపీలో జగన్ని అంటేనే హాయిగా ఉంటుందేమో. జగన్ నుంచి ఏమీ ఘాటు రిప్లై రాదు కదా. అందుకే జగన్ అలుసు అయ్యారేమో. 

 

కానీ వైసీపీ అభిమానులు, నేతలు మాత్రం జగన్ కూడా కేసీయార్ లా మూడవ కన్ను తెరవాలి అంటున్నారు. కువిమర్శలు చేసేవారి మీద ప్రతి విమర్శ చేస్తేనే బ్యాలన్స్ అవుతుందని అంటున్నారు.కానీ జగన్ సైలెంట్ గానే ఉంటున్నారు. అదే విమర్శలు చేసేవారికి బాగున్నట్లుగా ఉంది. అంతే మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: