ముఖ్యమంత్రి వైయస్ జగన్ శైలి ప్రత్యేకమైనది. మొన్నటి వరకు ఏపీ ని పరిపాలించిన చంద్రబాబు ప్రజలకు ఒక ట్రెండ్ చూపించారు. రాజకీయాలు అంటే ఇలానే చేయాలన్న భావన ప్రజల్లో కలిగించారు. ఇక పరిపాలనలో కూడా బాబు తనకంటూ ప్రత్యేకమైన మార్క్ బ్రాండ్ ప్రజల్లో గుర్తుండిపోయే  విధంగా వేశారు. ఒక విధంగా చెప్పాలంటే 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన బాబు వేసిన ముద్ర నుంచి బయటకు రావటం జనాలు ఆ వైపు నుంచి తన వైపుగా తిపుకోవడం అంటే కష్టమైన పనే. కానీ జగన్ ఈ విషయంలో నిదానమే ప్రధానం అన్నట్టుగా ముందుకు సాగుతున్నారు. జగన్ స్టైల్ అంతా వేరు ఆయన ఎక్కువగా మాట్లాడరు. కానీ ఆయన చేసే పనులు మాత్రమే మాట్లాడాలి అన్నట్టుగా వ్యవహరిస్తూ ప్రస్తుతం రాణిస్తున్నారు. ఇదే విధానాన్ని ఇప్పుడిప్పుడే ప్రజలకు కూడా అలవాటు చేస్తున్నారు.

 

అది ఈ మధ్య కరోనా వైరస్ ఇలాంటి విపత్కర ఈ పరిస్థితుల్లో ప్రజలకు మెల్లగా బోధపడుతుంది. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రులలో జగన్కి అత్యంత దగ్గరగా ఉండే నేత ఎవరు అని అంటే వినబడే పేరు కేసీఆర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగకుండానే కేసిఆర్ జగన్ ని ఫెడరల్ ఫ్రంట్ లోకి ఆహ్వానించారు. ఆ తర్వాత ఎలాగో జగన్ సీఎం అయ్యారు అని మనందరికీ తెలిసిన విషయమే. అలాగే తర్వాత జగన్ కు  అత్యంత దగ్గరగా ఉండే సిఎంలలో ఒడిస్సా సీఎం నవీన్ పట్నాయక్ కూడా ఒకరు.

 

అలాగే ఇరుగు పొరుగు రాష్ట్రాలతో ఇటీవల జగన్ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ జాతీయ రాజకీయాల్లో కూడా మెల్లగా కొత్త స్నేహాలు ఏర్పరుచుకుంటూన్నట్లు అర్థమవుతోంది. చాలా వరకు ప్రతి ఒకరితో చాలా సానుకూలంగా ఉంటున్నారు. అత్యంత తక్కువ సమయంలో ఈ విధంగా దేశ వ్యాప్తంగా పాపులర్ అయింది ఒక వైయస్ జగన్ అని ఇది భారీ రికార్డ్ అని జాతీయ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సంవత్సరం గడవకముందే దేశవ్యాప్తంగా జగన్ తనకంటూ సెపరేట్ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు అని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: