దేశంలో ఏ ముహూర్తంలో కరోనా మొదలైందో కానీ.. మనిషికి కంటిమీద కునుకు లేకుండా పోతుంది. ఇక లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి కొంత మంది మనుషులు ఉన్మాదులుగా మారిపోతున్నారు.  ఇంటి పట్టున ఉంటూ కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి. కానీ నిరంతరం ఇంట్లో గడుపుతూ పిచ్చెక్కిపోతున్నారు కొంత మంది మగరాయుళ్లు.  ఇదే సమయంలో కొంత మందికి మద్యం లభించకపోవడంతో  ఉన్మాదులుగా మారిపోతున్నారు. తాజాగా తమకు కటింగ్ చేయలేదన్న కక్ష్య పెంచుకొని కొంత మంది జులాయిలు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నారు.   

 

వివరాల్లోకి వెళితే..  బిహార్‌లోని బంకా జిల్లాలో మైన్వా గ్రామానికి చెందిన 42 ఏళ్ల దినేశ్ ఠాకూర్ క్షురకుడు. ఈ మద్య ముంబాయి నుంచి తన స్వగ్రామానికి చేరుకున్న తర్వాత క్వారంటైన్ లో ఉంటున్నాడు.  అప్పటికే ఆ ఊర్లో క్షురకుడు లేకా ఇబ్బందులు పడుతున్నారు కొంతమంది యువకులు.  ఈ నేపథ్యంలో ఆ గ్రామానికి చెందిన  బివిప్ దానే, కులు తదితర జులాయి యువకులు అతణ్ని తమకు కటింగ్, షేవింగ్ చేయాలని ఒత్తడి తెచ్చారు.  కానీ దినేష్ మాత్రం ససేమిరా అన్నాడు.. అంతే తమకు కటింగ్ చేయవా అని ఉన్మాదులుగా మారారు.  ఈ ముఠాపై అప్పటికే పలు చిన్న చిన్న కేసులు ఉన్నాయి.  తమకు కటింగ్ చేయకుండా అవమానించాడని... దినేష్ ని ఎలాగైనా అంతం చేయాలని ఈ మూఠా ఓ పథకం వేసింది.

 

 దినేశ్ ఠాకూర్ మాట్లాడాలని నమ్మకంగా తమ వెంట పక్క ఊరికి తీసుకు వెళ్లారు. అయితే వారిపై మొదటి నుంచి దినేశ్ ఠాకూర్ భార్యకు అనుమానంగానే ఉంది.  ఈ నేపథ్యంలో ఆ దుర్మార్గులు దినేశ్ ని పక్కఊరి పోలాల్లోకి తీసుకు వెళ్లి కాల్చి చంపారు.  విషయం తెలుసుకున్న దినేశ్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుల్లో ఇద్దర్ని పట్టుకున్నామని, మిగతా వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పుకొస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: