నరేంద్ర మోడీని తక్కువ అంచనా వేసి పాకిస్థాన్ కోరి పెద్ద కష్టాలను, నష్టాలను తెచ్చుకుంది. మరో వైపు దానికి మద్దతు ఇస్తూ చైనా సైతం భారత్ విషయంలో  వేలూ కాలూ పెడుతోంది. మన భూగాలాను ఆక్రమించడం, పాక్ కి ఆర్ధికంగా, రక్షణ పరంగా సాయం చేస్తూ భారత్ ని ఎప్పటికపుడు ఇబ్బందుల్లోకి నెట్టడం చేస్తోంది.

 

అయితే కాలం ఎపుడూ ఒకేలా ఉండదు. ఇపుడు చైనాకి ఒక్కసారిగా వరసగా  ఇబ్బందులు వచ్చిపడ్డాయి. కరోనా వైరస్ అక్కడ పుట్టడంతో ప్రపంచం అనుమానం చూపులు చూస్తోంది. ప్రపంచాన్ని ఆటాడాలించాలనుకుని చైనా ఇంతకాలం చేసిన విన్యాసాలకు కరోనా వైరస్ తో చెక్ పడిపోయిందని అంటున్నారు. దక్షిణాసియాలో ఇపుడు చైనా పాపులారిటీ బాగా తగ్గింది. దాంతో ప్రపంచ దేశాల చూపు భారత్ మీద పడింట.

 

ఈ పరిణామాలను సొమ్ము చేసుకోవాలని భారత్ కూడా ఆశపడుతోంది. అదే సమయంలో తన చిరకాల శత్రువు చైనాను కూడా దెబ్బతీయాలనుకుంటోందిట. చైనాలో ఉన్న ప్రపంచ దేశాల పరిశ్రమలు ఇపుడు షిఫ్ట్ అవుతాయని అంటున్నారు. అదే విధంగా భారత్ లో పెట్టుబడులకు కూడా అనేక కొత్త పరిశ్రమలు ఆసక్తి చూపిస్తునాయి. దాంతో వారికి కావాల్సిన భూమితో పాటు, ఇతర సదుపాయలు కల్పించడం ద్వారా రానున్న రోజుల్లో భారత్ ని అభివ్రుధ్ధి చెందిన దేశంలా మార్చాలని మోడీ పక్కా ప్లాన్ రూపొందించారట.

 

ఈ పరిణామాలు డ్రాగాన్ కి తీరని వేదన కలిగిస్తున్నాయిట. ఒక విధంగా చెప్పుకోవాలంటే భారత్ ప్రపంచానికి నమ్మకమైన దేశంగా, సురక్షితమైన ప్రాంతంగా మారిపోతోంది. భారత్ విషయంలో అమెరికా తో పాటు ఇతర అభివ్రుధ్ధి చెందిన దేశాల ఆలోచనలు ఇలాగే ఉన్నాయి.దాంతో రానున్న రోజుల్లో భారత్ ప్రగతికి బాటలు వేస్తూనే డ్రాగాన్ తోడేలు రాజకీయాలు మోడీ తనదైన గుణపాఠం చెప్పబోతున్నారని అంటున్నారు. మరి ముందుంది ముసళ్ళ పండుగట.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: