కరోనా వైరస్ నుండి దేశ ప్రజలను రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ వల్ల 40 కోట్ల మంది ప్రజలు దారిద్ర్యం లోకి జారిపోయే అవకాశం ఉందని అంతర్జాతీయ కార్మిక సంఘం అంచనా వేస్తోంది. మార్చి నుండి మొదలైన లాక్ డౌన్ వల్ల మునుపెన్నడూ లేని విధంగా చాలా మంది కార్మికులు ఉపాధి కోల్పోయి జరిగింది. ఎక్కడికక్కడ అన్ని క్లోజ్ అవ్వటంతో దేశ ఆర్థిక పరిస్థితి కి ఆదాయం లేకుండా పోయింది. దాదాపు రెండు నెలల కాలంలో దేశ ఆర్థిక ఖజానాకు 20 నుండి 30 లక్షల కోట్ల వరకు నష్టం వచ్చిందని ఆర్థిక నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. రెండో దశ లాక్ డౌన్ పొడిగించిన సమయంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని మినహాయింపులు ఇచ్చింది.

 

గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలకు, వ్యవసాయపనులకు మినహాయింపు ఇచ్చింది. ఇదే సందర్భంలో తాజాగా మూడో దశ లాక్ డౌన్ పొడిగించిన సమయంలో గ్రీన్ మరియు ఆరెంజ్ జోన్ లలో మద్యం విక్రయాలు మరి కొన్ని వ్యాపార కార్యకలాపాలకు అనుమతి ఇవ్వడం జరిగింది. దీంతో వ్యాపార లావాదేవీలు మొదలు కావడంతో రాష్ట్రాలకు మరియు కేంద్రాలకు కొంత ఊరట లభించింది. అంతేకాకుండా కొన్ని గ్రీన్ జోన్లలో బస్సులు కూడా నడుపుకోవచ్చని పేర్కొంది. గ్రీన్ జోన్లుగా ఉన్న జిల్లాల మధ్య రాకపోకలకు ఓకే చెప్పింది.

 

దీంతో దాదాపు చాలా వరకు రెండు నెలల వరకు ఎటువంటి ఆదాయం లేని దేశ ఖజానాకు ఇప్పటినుండి రాబడి వచ్చే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. అయితే పూర్తి స్థాయిలో కొన్ని చోట్ల వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించాలని పరిస్థితి ఉండటంతో రాష్ట్రాలకు మాత్రం పెద్దగా ఆదాయం ఒనగూరే అవకాశం లేదని ఆర్థిక నిపుణులు అంటున్నారు. దాదాపు మూడో దశ లాక్ డౌన్ చివరికొచ్చేసరికి దాదాపు దేశ ఆర్థిక రంగం గాడిలో పడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: