గత రెండు రోజుల నుండి కేరళ అలాగే జార్ఖండ్ లో జీరో కరోనా కేసులు నమోదుకాగా మంగళవారం మాత్రం మళ్ళీ కొత్త కేసులు నమోదయ్యాయి. కేరళ లో ఈరోజు కొత్తగా 3కేసులు నమోదయ్యాయి. దాంతో కేరళ లో మొత్తం కేసుల సంఖ్య 502కుచేరగా 462 మంది బాధితులు కోలుకొని ముగ్గురు మరణించారు. ప్రస్తుతం 37కేసులు మాత్రమే యాక్టీవ్ గా ఉన్నాయని సీఎం విజయన్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.  
ఇక జార్ఖండ్ లో కూడా ఈరోజు కొత్తగా మరో మూడు కరోనా కేసులు నమోదుకాగా ప్రస్తతం అక్కడ మొత్తం కేసుల సంఖ్య 122 కు చేరిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రతినిధి నితిన్ మందన్ కులకర్ణి ప్రకటించారు. అయితే మూడో దశ లాక్ డౌన్ ముగిసేవరకు జార్ఖండ్ లో ఎలాంటి మినహాయింపులు ఉండవని ఇటీవల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ ప్రకటించారు.
 
ఇక అటు హర్యానా లో మాత్రం కేసుల సంఖ్య పెరుగుతూనే వుంది. ఈఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా 31కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 548కు చేరింది. ఇదిలావుండగా తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే  ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు కొత్తగా  67కరోనా కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 1717 కు చేరింది. కాగా ఈరోజు తెలంగాణ కు సంబంధించినహెల్త్ బులిటెన్ ఇంకా విడుదలకాలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: