తెలంగాణ లో రాజకీయం ఒక్కసారిగా వేడిక్కింది . ఒక వైపు రాష్ట్ర కేబినెట్  సమావేశం అవుతుండగా , మరొకవైపు విపక్షాలన్నీ నిరసనకు దిగాయి . సోమవారం గవర్నర్ తమిళిసై ని కలిసిన అఖిలపక్ష నేతల కరోనా కట్టడి ప్రభుత్వ తీసుకుంటున్న చర్యలపై పెదవి విరిచారు .అదేసమయం లో  రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మండిపడ్డాడు . ప్రభుత్వ వ్యవహార శైలి వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు  .

 

గవర్నర్ ను కలిసి తమ నిరసన వ్యక్తం చేసిన అఖిలపక్షం నేతల , మంగళవారం మూకుమ్మడి ప్రభుత్వ వ్యవహారశైలి నిరసిస్తూ ఎవరికివారే దీక్షకు దిగారు . కాంగ్రెస్ పార్టీ  అద్వర్యం లో  రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ  నేతల దీక్షలు చేపట్టగా , టీ టిడిపి , టిజెఎస్ పార్టీలు దీక్ష చేపట్టాయి . కరోనా కట్టడి లో  రాష్ట్ర ప్రభుత్వం  భేషుగా వ్యవహరిస్తోందని మీడియా కోడై కూస్తున్న తరుణం లో  విపక్షాలన్నీ  ప్రభుత్వం పై దుమ్మెత్తిపోయడం హాట్  టాఫిక్ గా మారింది . విపక్షాలు తమ ఉనికి కోసమే ఇటువంటి చీప్ ట్రిక్స్ కు పాల్పడుతున్నాయని టీఆరెస్ నేతల మండిపడుతున్నారు . కేవలం తాము ఉన్నామని ప్రజలకు గుర్తు చేయడానికే ఈ దీక్షలు చేశారని అపహాస్యం చేస్తున్నారు .

 

అయితే ధాన్యం కొనుగోళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని , ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఏడువేల మార్కెట్లను ఏర్పాటు చేసిందని టీఆరెస్ నేతలు చెప్పుకొచ్చారు . కరోనా కట్టడిలోనూ రాష్ట్ర ప్రభుత్వం సమర్ధవంతంగా పని చేస్తూ , ఇతర రాష్ట్రాలకు ఆదర్శనంగా నిలుస్తోన్న తరుణం లో విపక్షాలు చేస్తున్న యాగిని ప్రజలు పట్టించుకునే స్థితిలో లేరని పలువురు టీఆరెస్ నాయకులు అంటున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: