కరోనా వైరస్ మూడో దశ లాక్ డౌన్ కేంద్రం ప్రకటించడం మనకందరికీ తెలిసిందే. మే 17 వరకు పొడిగించడం జరిగింది. వైరస్ ప్రభావం దేశంలో తగ్గకపోవడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో మినహాయింపులు లో భాగంగా మద్యం దుకాణాలను ఓపెన్ చేసుకోవచ్చని కేంద్రం ప్రకటించడం మనకందరికీ తెలిసినదే. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న మందుబాబులు ఒక్కసారిగా మద్యం దుకాణాల ముందు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ లైన్ కట్టి మరి తాగుతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దాదాపు 40 రోజులకు పైగా మందు గొంతులో పడకపోవడంతో కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆవురావురుమంటూ మందు షాపులు ముందు క్యూ కట్టి తెగ కొంటున్నారు.

 

అయితే మద్యపాన నిషేధం గురించి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యపానానికి ఇదే సరైన సమయం అని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు చంద్రబాబు కి షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు. అసలు మీరు ఏపీ లో ఉన్న టైంలో మందుబాబులకు కొరత లేదండి, అటువంటి మీరు మద్యపాన నిషేధం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని కామెంట్ చేస్తున్నారు. మరికొంత మంది నెటిజన్లు ఈ విధంగా ట్రోల్ చేస్తున్నారు...ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో సంపూర్ణ మద్యనిషేధం విధించారు.

 

అయితే అదే పార్టీ నుంచి ఎన్టీఆర్ నుంచి అధికారం తీసుకున్న  మద్యనిషేధాన్ని పూర్తిగా ఎత్తి వేసింది గుర్తులేదా చంద్రబాబు. అలాంటి నీవు మద్యపాన నిషేధం గురించి మాట్లాడుతున్నావా అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు దేశ వ్యాప్తంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా మద్యం దుకాణాలు ఓపెన్ అయ్యాయి, మరి వాటి మీద ఎందుకు ప్రశ్నించడం లేదు చంద్రబాబు అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: