ఏపీలో మద్యం రగడ నడుస్తుంది. కరోనా నేపథ్యంలో 50 రోజుల పైనే ఏపీలో లాక్ డౌన్ కొనసాగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కూడా లాక్ డౌన్ మే 17 వరకు పొడిగించారు. కానీ ఆదాయ మార్గాలు మూసుకుపోయిన నేపథ్యంలో లాక్ డౌన్ లో కొన్ని సడలింపులు ఇచ్చారు. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం మద్యం అమ్మకాలకు పర్మిషన్ ఇచ్చింది. దీంతో 50 రోజుల పాటు మందు లేక ఇబ్బందులు పడ్డ మందుబాబులు ఒక్కసారిగా ఎగబడటంతో, వైన్ షాపులు దగ్గర ఖాళీ ఉండటం లేదు.

 

అసలు ఏ మాత్రం సామాజిక దూరం పాటించకుండా మందుబాబులు క్యూల్లో నిల్చున్నారు. దీంతో ఏపీ ప్రభుత్వంపై తీవ్రంగా విమర్సలు వస్తున్నాయి. అసలు ఈ టైంలో మద్యం షాపులు ఓపెన్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం కరోనా ఫ్రెండ్లీ అంటూ మాట్లాడుతున్నారు. అసలు నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడానికి 3 గంట టైం ఇచ్చి, మందు తెచ్చుకోవడానికి 8 గంటలు ఎలా ఇస్తారని అడుగుతున్నారు.

 

అయితే ప్రతిపక్షాలు చేసే విమర్శలకు చెక్ పెట్టడంలో భాగంగా మంత్రి తానేటి వనిత కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. లాక్ డౌన్  తర్వాత మద్యం షాపులు ఎప్పుడు తెరిచినా పరిస్థితి ఇలాగే ఉంటుందని, మానసిక రుగ్మతలు పెరగకుండా  ఉండేందుకే  ప్రభుత్వం మద్యం షాపులు తెరిచిందన్నారు. మద్యపానాన్ని నిషేదించే చర్యల్లో భాగంగా మద్యం రేట్లు పెంచారని, ఆదాయం కోసం కాదని మాట్లాడారు.

 

ఇక మంత్రి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నుంచి కౌంటర్లు వస్తున్నాయి. అసలు మహిళా మంత్రి అయ్యి ఉండి, మద్యం షాపులని ఓపెన్ చేయడాన్ని ఎలా సమర్ధిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. పైగా మద్యపాన నిషేధం చేయడానికి, మద్యం ధరల్ని పెంచామనే లాజిక్ ఏ మాత్రం కరెక్ట్ గా లేదని, పైగా మానసిక రుగ్మతలు రాకుండా అంటున్నారు..మరి  ఇన్ని రోజులు ఏమైపోయాని అడుగుతున్నారు. ఇక  గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు మద్యంపై పోరాటం చేసిన వైసీపీ మహిళా నేతలు ఏమైపోయారని ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: