ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి వినూత్న పథకాలతో ప్రజల మన్నలను పొందుతున్నారు . ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసిన  ఆయన , ద్వారానే రాష్ట్ర రైతాంగానికి ఎరువులు , విత్తనాలు సరఫరా చేయాలని నిర్ణయించారు . గ్రామ సచివాలయాల్లో రైతు భరోసా లబ్ధిదారుల జాబితా ప్రదర్శించాలని అధికారులను ఆదేశించారు . రైతులకు అందించే ఎరువుల, విత్తనాల పంపిణి లో పారదర్శకత కోసమే జగన్
  ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది .
 
అయితే రైతులకు ప్రభుత్వం తరుపున అందజేసే నగదు సహాయాన్ని బ్యాంక్ లనుంచి విత్ డ్రా చేసుకోవడానికి వీలుగా డెబిట్ కార్డు లు అందజేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తుంది .ఈ డెబిట్ కార్డుల ద్వారా అన్ని బ్యాంక్  లలో విత్ డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించాలని భావిస్తున్నట్లు సమాచారం . ఇప్పటికే రాష్ట్రం లోని  అన్ని  వర్గాల ప్రజల సంక్షేమం కొసం అనేక పథకాలు ప్రవేశపెట్టిన జగన్  సర్కార్ , రానున్నా  ఖరీఫ్ సీజన్ ను దృష్టిలో పెట్టుకుని రైతులకు డెబిట్ కార్డు ను అందజేయాలని యోచిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి . ఇప్పటికి కిసాన్ క్రెడిట్ కార్డు లు మనుగడ లో ఉన్నాయి . అయితే రైతులకు తొలిసారిగా డెబిట్ కార్దు  లను  అందజేయాలని జగన్  సర్కార్  నిర్ణయించి దేశానికి మార్గదర్శకంగా నిలిచింది .
 
రైతులకు డెబిట్ కార్డులు ఇవ్వాలన్న జగన్ సర్కార్ యోచనను రైతుసంఘాల నేతలు స్వాగతిస్తున్నారు . రైతులను గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని , అయితే జగన్ సర్కార్ మాత్రం రైతాంగాన్ని ఆదుకునేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టడం హర్షణీయమని పేర్కొన్నారు . రైతులను అన్ని విధాలుగా ఆదుకున్నప్పుడే వారు మనుగడ సాధించగలరని అన్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: