మద్యం ప్రియులకు కేసీఆర్ సర్కార్ షాక్ ఇచ్చింది . లాక్ డౌన్ తరువాత కేంద్ర మార్గ దర్శకాల మేరకు మద్యం దుకాణాలను ప్రారంభించాలని నిర్ణయించిన కేసీఆర్ సర్కార్ , మద్యం ధరలను పెంచాలని నిర్ణయించింది . అయితే ఇందులో రెండు తరహా స్లాబ్ లు విధించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు . ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రం లో చాల తక్కువ శాతం మద్యం ధరలను పెంచుతున్నట్లు పేర్కొన్నారు . సాధారణ మద్యం పై 11 శాతం, ఖరీదైన మద్యం పై 16 శాతం ధరలను పెంచనున్నట్లు తెలిపారు .

 

లాక్ డౌన్ నేపధ్యం లో రాష్ట్ర ఖజానా ఖాళీకావడం తో , రాష్ట్ర ప్రభుత్వం  మద్యంను ఆదాయ వనరుగా భావిస్తున్నట్లు  స్పష్టం అవుతోంది . అందుకే ప్రభుత్వ ఖజానాను నింపుకోవడానికి మద్యం ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది . ఇక లాక్ డౌన్ పొడగించాలని నిర్ణయించిన కేసీఆర్ సర్కార్ , ఆరెంజ్ , గ్రీన్ జోన్లలో అన్ని రకాల షాపులను తెరిచేందుకు అనుమతించింది . రెడ్ జోన్ లో మాత్రం ఈ నెల 15 వతేది తరువాత షాప్ లు తెరిచే అంశం పై ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు . రెడ్ జోన్లలో షాప్ లను తెరిస్తే ప్రమాదం ముంచుకువచ్చే అవకాశాలున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు . అదే సమయం లో కరోనా ను కట్టడి చేయడానికి ప్రతి ఒక్కరూ విధిగా భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు .

 

ఎవరో చెప్పారని బలవంతంగా కాకుండా , తమకు తామే భౌతిక దూరాన్ని  పాటించి ఈ మహమ్మారిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు . కరోనా బారినపడకుండా వృద్దులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్న కేసీఆర్ , వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి మూడు నెలలకు సరిపడా మందులను సరఫరా చేస్తామని చెప్పారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: