భారత దేశంలో కరోనా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ ను మే 17 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే..ఈ మేరకు ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు..దానితో ఆన్నీ రకాల సంస్థలు మూతపడ్డాయి..ప్రస్తుతం కరోనా కేసులు కొన్నీ ప్రాంతాలు కరోనా ఏరియాల్లో లేకపోవడంతో గ్రీన్ జోన్ ను ప్రకటించారు.. ఇకపోతే తెలుగు రాష్ట్రాల లోని మద్యం దుకాణాలను తెరవాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.. 

 

 

 

 

 

 

దేశంలోని మందు బాబులకు ఈ రోజు శుభదినం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 40 రోజులుగా తెరుచుకోని మందు దుకాణాలు ఇవ్వాళ ఓపెన్ అయ్యాయి. లాక్ డౌన్ కారణంగా ఇన్ని రోజులు క్లోజ్ అయిన వైన్ షాపులు ప్రధాని మోడీ షరతులతో కూడిన పర్మిషన్ ఇవ్వడంతో ఈ రోజు నుంచి అందుబాటులోకి వచ్చాయి. సామాజిక దూరం పాటిస్తూ కనీసం 6 ఫీట్ల దూరం ఉంటూ లిక్కర్ కొనుగోలు చేసుకోవచ్చని కేంద్రం వెసులుబాటు ఇచ్చింది. దీంతో ఇంతకాలం సుక్క లేక తహతహలాడిన ప్రాణాలు మందు షాపుల ముందు ప్రత్యక్షమయ్యాయి.

 

 

 

 

ఒడిశాకు చెందిన ఇద్దరు స్నేహితులు నగరంలోని ఇసకతోట బస్టాప్ వెనుక ప్రాంతంలో రూమ్ అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. నిన్న మద్యం షాపులు తెరవడంతో ఇద్దరూ మద్యం తెచ్చుకుని తాగారు. ఈ క్రమంలో డబ్బుల విషయమై వివాదం రేగడంతో మద్యం మత్తులో ఇద్దరూ పరస్పరం దాడి చేసుకున్నారు.

 

 

 

 

 

 

విచక్షణా రహితంగా కొట్టుకోవడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. గాయాలపాలైన వ్యక్తిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌ని పిలిపించి ఆధారాలు సేకరించారు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు..

మరింత సమాచారం తెలుసుకోండి: