ఊహించనట్లుగానే తెలంగాణ లో కూడా మద్యం షాపులకు గ్రీన్ సిగ్నల్ లభిచింది. కేవలం కంటామినేట్ జోన్ల లో వున్న 15 మద్యం దుకాణాలు తప్ప రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుండి అన్ని వైన్  షాపులు తెరుచుకోనున్నాయి. రెడ్ జోన్లలో కూడా వైన్స్ ఓపెన్ కానుండడం కొసమెరుపు. మాములుగానే అన్ని రాష్ట్రాల్లో కన్నా తెలంగాణ లో మద్యం ద్వారా వచ్చే ఆదాయం ఎక్కువగా ఉంటుంది అలాంటిది ఇప్పుడు దాదాపు 44 రోజుల తరువాత షాపులు తెరుస్తుండడం దానికి తోడు అన్ని రకాల బ్రాండ్ల పై 16శాతం ధర పెంచి అమ్మనుండడం తో తొలి రోజు తెలంగాణ లో సుమారు 100కోట్ల రూపాయల మద్యం అమ్ముడుకావడం ఖాయం గా కనిపిస్తుంది.
 
చీప్ లిక్కర్ల ఫై మాత్రం 11శాతం ధర పెంచనున్నారు. వీటికి తోడు కొనుగోలు విషయంలో పెద్దగా ఆంక్షలు లేకపోవడం పైగా ఉదయం 10గంటల నుండి సాయంత్రం 6గంటల వరకు మద్యం అమ్మకాలకు పర్మిషన్ రావడంతో 100కోట్ల టార్గెట్ పెద్ద కష్టమేమి కాకపోవచ్చు. అయితే షాఫుల వద్ద భౌతిక దూరం పాటించడం మాస్క్ లను ధరించడం తప్పనిసరి. ఈ నిబంధనలు పాటించకుంటే మాత్రం   షౌపులు మూసివేయిస్తామని ప్రభుత్వం తెలిపింది. 
 
ఇక దేశ వ్యాప్తంగా మే 17వరకు లాక్ డౌన్ కొనసాగనుండగా తెలంగాణ లో మాత్రం ఈనెల 29వరకు అమలుకానుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అలాగే కేంద్రం ఇచ్చిన అన్ని రకాల సడలింపులను అమలుచేయనున్నామని కానీ రెడ్ జోన్లలో మాత్రం మద్యం షాపులు, నిత్యావసర వస్తువుల దుకాణాలు తప్పించి  మిగితావి తెరవకూడదని కేసీఆర్ ఆదేశించారు. అయితే కేంద్రం గ్రీన్ జోన్ల లో బస్ సర్వీసులకు అనుమతించగా తెలంగాణాలో మాత్రం ఈనెల 15తరువాత బస్ లను నడుపుతామని  సీఎం స్పష్టం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: