ఈరోజు తెల్లవారకముందే అలారం పెట్టుకుని మందు షాపులు ముందు పడిగాపులు కాద్దామని సిద్ధమైన మందుబాబులకు షాకింగ్ మరియు బ్రేకింగ్ న్యూస్. నేడు అనగా బుధవారం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాలను సదరు వ్యక్తులకు మూసివేయనున్నారు. అర్ధరాత్రి రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చిన కీలక ఉత్తర్వుల ప్రకారం తదుపరి నోటీస్ వచ్చేవరకూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని మద్యం దుకాణాలు అన్నీ మూతబడనున్నాయి.

 

కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ 3.0 లో భాగంగా దేశంలోని అన్నీ రాష్ట్రాలలోని గ్రీన్ మరియు ఆరెంజ్ జోన్ లలో ఉన్న మద్యం షాపులు అన్నీ తెరుచుకొని లిక్కర్ విక్రయించవచ్చని తెలిపిన సంగతి తెలిసిందే. దాంతో మొన్న ప్రారంభమైన లిక్కర్ ప్రభంజనం ఒక ఊపులో కొనసాగింది. కేవలం రెండు రోజుల్లోనే ఏపీ ప్రభుత్వానికి దగ్గర దగ్గర 100 కోట్ల ఆదాయం వచ్చింది అంటే మన మందు బాబులు రకంగా దేశ ఆర్థిక వ్యవస్థ ని ఒంటిచేత్తో నిలబెడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.

 

అయితే తెల్లవారుజామున నుండి చీకటి పడే వరకు కిలోమీటర్ల పొడవున బారులు తీరుతున్న జనం సామాజిక దూరం పాటించకపోవడం మరియు వారిని అదుపు చేసే క్రమంలో పోలీసులకు ఎన్నో ఇబ్బందులు ఎదురు కావడంఇంకా ఆర్థిక పరిస్థితిని మెరుగు పరుచుకోవడానికన్నా ముందు ప్రజల ప్రాణాలకు ప్రాముఖ్యతనిచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యవసరంగా సామాజిక దూరం పాటించని మద్యం విక్రయాలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. అలాగే ఎవరైతే మాస్కులు లేకుండా షాపులు ముందు ఉంటారో వారికి మద్యం అమ్మబడడు.

 

రాత్రికి రాత్రి హుటాహుటిన తీసుకున్న నిర్ణయం మరి కొద్ది గంటల నుండి అమలు కాబోతుంది. కాబట్టి బుధవారం రోజున అత్యుత్సాహులైన మందుబాబులకు రాష్ట్రంలో మద్యం దొరికే అవకాశమే లేదు. ఇక ఏపీ ప్రభుత్వం ఎప్పటికీ మద్యం విక్రయాలను మామూలు రేట్లకు అనుమతిని ఇస్తారో కూడా తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: