దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.  కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో ఈ నెల 17 వరకు కేంద్రం లాక్ డౌన్ ను పొడిగించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ వల్ల దేశంలో ఆకలితో అలమటించే వారి సంఖ్యతో పాటు ఉద్యోగాలు కోల్పోయే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. లాక్ డౌన్ వల్ల దేశవ్యాప్తంగా వ్యాపార, వాణిజ్య సేవలు స్తంభించిపోయాయి. 
 
దీంతో కొన్ని కంపెనీలు వేతనాల్లో కోత విధిస్తుంటే మరొకొన్ని కంపెనీలు ఉద్యోగాల కోతకు సిద్ధమయ్యాయి. లాక్ డౌన్ వల్ల కొత్త ఉద్యోగాల సంగతి పక్కన పెడితే ఉన్న ఉద్యోగాలే ఉంటాయో ఊడతాయో తెలియని పరిస్థితి నెలకొంది. చాలా మంది ఉద్యోగులు ఉద్యోగ స్థిరత్వం కొనసాగడం సందేహమేనని అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగులు ఉద్యోగాల కోత, వేతనాల కోత, నెమ్మదించిన ఆర్థికవ్యవస్థ లాంటి అంశాల వల్ల ఇబ్బందులు పడుతున్నారు. 
 
మరికొన్ని నెలల పాటు కొత్త ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉంటాయని ఉద్యోగులు భావిస్తూ ఉండటం గమనార్హం. ఇప్పటికే పలు కంపెనీలు కొత్త నియామకాలు ఉండబోవని స్పష్టం చేశాయి. లాక్ డౌన్ వల్ల దేశంలో నిరుద్యోగిత రేటు 27.11 శాతం పెరుగుతుందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ సంస్థ అధ్యయనంలో తేలింది. కరోనా కేసులు ఎక్కువగా నమోదైన ప్రాంతాల్లోనే నిరుద్యోగిత రేటు గణనీయంగా పెరుగుతున్నట్టు సర్వేల్లో వెల్లడైంది. 
 
సీఎంఐఈ లాక్ డౌన్ ప్రకటించిన రోజు నుంచి దేశంలో నిరుద్యోగిత రేటు క్రమంగా పెరుగుతోందని నివేదిక ఇచ్చింది. లాక్ డౌన్ వల్ల ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడంతో వలస వచ్చిన వాళ్లకు ఉపాధి దొరకడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ లో ఉద్యోగ భద్రతపై ఎక్కువమంది ఆందోళనతో ఉన్నట్టు సర్వే గుర్తించింది.           

మరింత సమాచారం తెలుసుకోండి: