ప్రపంచాన్ని ముప్పు తిప్పలు పెడుతున్న కరోనా వైరస్ ఎక్కడ పుట్టిందన్న విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు.. అది చైనాలోని వుహాన్ నగరంలో అని. కానీ అది ఎలా పుట్టింది.. జంతువుల నుంచి మనిషికి సోకిందా.. లేక.. చైనా ల్యాబ్ లో నుంచి పొరపాటున బయటకు వచ్చిందా.. లేక.. చైనా కావాలనే ఈ వైరస్ ను పుట్టించిందా..? ఈ ప్రశ్నకు మాత్రం సరైన సమాధానం దొరకడం లేదు.

 

 

అయితే ఇది చైనా తప్పిదాల కారణంగానే ప్రపంచమంతటా వ్యాపించిందన్నది అమెరికా వంటి దేశాల ఆరోపణ. ఈ మేరకు అమెరికన్ ఏజన్సీలో విచారణ కూడా ప్రారంభించాయి. చైనా నుంచి నష్టపరిహారం రాబట్టాలని మరికొన్ని దేశాలు కూడా ప్రయత్నిస్తున్నాయి. అయితే ఈ దేశాల అనుమానాలు నిజం చేసేలా.. ఇప్పుడు చైనా కూడా తన పౌరులపై ఉక్కుపాదం మోపుతోంది.

 

 

కరోనా వైరస్ కు సంబంధించిన స్థానిక పౌరులు ఎవరైనా కోర్టుకెక్కితే వారి గొంతు నొక్కేస్తోంది. ఈ చైనా వైఖరి మరింత అనుమానాస్పదంగా కనిపిస్తోంది. చైనా ప్రభుత్వ విధి విధానాలను పౌరులెవరైనా ప్రశ్నిస్తే శిక్షలు కఠినంగా ఉంటాయి. అది పూర్తి స్థాయి కమ్యూనిస్టు దేశం. నోరు తెరిచిన వాడిని తెరిచినట్టు జైలుకు తీసుకెళ్లి నొక్కేస్తారు. అసలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫిర్యాదు కూడా చేసే అవకాశం లేని విధానాలు వారివి.

 

 

తాజాగా వెలుగు చూసిన ఓ కథనం ప్రకారం.. కరోనా పుట్టిల్లు వుహాన్‌ సిటీలోని ఏడుగురు సభ్యులున్న ఓ కుటుంబం ఆ వైరస్ కారణంగా చాలా నష్టపోయింది. కుటుంబ సభ్యుల్లో చాలా మందిని కోల్పోయింది. మిగిలిన చైనా తప్పులను కోర్టుల్లో ప్రశ్నించేందుకు ప్రయత్నించారు. కానీ.. అక్కడ న్యాయశాఖ అధికారులు వారిని బెదిరిస్తున్నారట. ఉల్టావాళ్లకే శిక్షలు వేస్తున్నారట. ఈ విషయాన్ని న్యూయార్క్ టైమ్స్ పత్రిక బయట పెట్టింది. భయపడి వెనక్కి తగ్గుతున్నారు!

 

మరింత సమాచారం తెలుసుకోండి: