క‌రోనా క‌లిసి బ్ర‌త‌కడం ఖాయ‌మ‌ని తేలిపోయిన త‌రుణంలో అంద‌రి చూపు ఈ వ్యాక్సిన్‌ఫైనే ప‌డింది. ఎప్పుడెప్పుడూ ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌స్తుందా అంటూ జ‌నం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో అమెరికాలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న హైదరాబాదీ డాక్టర్‌ శివరామ కృష్ణ గుడ్ న్యూస్ తెలిపారు. కరోనా వైరస్‌కు ఔషధాన్ని అభివృద్ధి చేయడంలో తొలి విజయం సాధించామని ప్ర‌క‌టించారు. మూడు నుంచి నాలుగు నెలల్లో కరోనాకు ఔషధం అందుబాటులోకి వస్తుందని డాక్టర్‌ శివరామ కృష్ణ చెప్పారు.

 

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ నుంచి బయో కెమిస్ట్రీలో పీహెచ్‌డీ పూర్తిచేసిన శివరామకృష్ణ ప్రస్తుతం టెక్సాస్‌ రాష్ట్రంలోని యూనివర్సిటీ ఆఫ్‌ హ్యూస్టన్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. డల్లాస్‌లో ఈయన ఆధ్వర్యంలోని లింక్స్‌ బయో సైన్స్‌ సంస్థ కరోనాకు ఔషధాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ త‌రుణంలో తాజాగా శివ‌రామ‌కృష్ణ ఓ మీడియా సంస్థ‌తో మాట్లాడుతూ,  కృత్రిమ మేధస్సు (ఏఐ) సాయంతో 250 రకాల ఔషధాలపై పరిశోధనలు జరుపగా, యాంటీ మలేరియా, యాంటీ ఇమ్యూనిటీ ఔషధాలతోపాటు మరో మూడు డ్రగ్స్‌ ఫలితాన్ని ఇచ్చాయని పేర్కొన్నారు. త్వరలోనే మనుషులపై ప్రయోగిస్తామని, అది కూడా సఫలమైతే మూడు నుంచి నాలుగు నెలల్లో కరోనాకు ఔషధం అందుబాటులోకి వస్తుందని డాక్టర్‌ శివరామ కృష్ణ వెల్లడించారు.

 

కరోనా వైరస్​ వ్యాక్సిన్ విష‌యంలో నూత‌న విధానం అనుస‌రిస్తున్న‌ట్లు శివ‌రామ‌కృష్ణ ప్ర‌క‌టించారు. సార్స్‌, ఎబోలా, హెచ్‌ఐవీ, మెర్స్‌ వ్యాధులకు ఔషధాలను అభివృద్ధి చేసే క్రమంలో చేసిన కొన్ని ఔషధ మిశ్రమాల ద్వారా కరోనాకు మందును రూపొందించే ప్రయత్నం చేస్తున్నామని శివరామ కృష్ణ తెలిపారు. కొత్త రకం వ్యాధిని నయంచేసే మందును రూపొందించటానికి సాధారణంగా పది నుంచి పన్నెండు ఏళ్లు పడుతుందని డాక్టర్‌ శివరామ కృష్ణ తెలిపారు. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది శాస్త్రవేత్తలు ‘డ్రగ్‌ రీపర్పసింగ్‌' విధానంలో కొవిడ్‌-19కు ఔషధాన్ని తయారుచేయటానికి ప్రయత్నిస్త్తున్నారని డాక్టర్‌ శివరామ కృష్ణ చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: