ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు తరచూ హైదరాబాద్ నుంచి ప్రెస్ మీట్లు నిర్వహిస్తూ జగన్ సర్కారు పనితీరును విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. అదే జోరులో మొన్న జగన్ ప్రెస్ మీట్ లో చేసిన కొన్ని వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. ఇంతకీ జగన్ ఏమన్నారో ఓసారి చూద్దాం.. ఈ కరోనా అనేది ఇప్పట్లో పోయి రోగం కాదు.. దీని ప్రభావం ఇంకా చాలా కాలం మనపై ఉంటుంది. మనం కరోనాతో కలసి సహజీవనం చేయాల్సి ఉంటుంది అన్నారు జగన్.

 

 

ఈ మాటలపై చంద్రబాబు చాలా ఘాటుగా స్పందించారు. కరోనాతో కలసి జీవించాలని చెప్పే సీఎం గురించి ఇంకా ఏం మాట్లాడతామంటూ వెటకారం చేశారు. అయితే ఇప్పుడు మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా జగన్ బాటలోనే మాట్లాడుతున్నారు. మొన్నటికి మొన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా ఇదే మాట అన్నాడు.. కరోనాతో మనం కలసి సహజీవనం చేయాల్సిందే అని. పోనీ.. ఆయన అంటే ఎక్కడో ఢిల్లీకి సీఎం. కానీ ఇప్పుడు పొరుగు రాష్ట్ర సీఎం కేసీఆర్ కూడా సేమ్ డైలాగ్ కొడుతున్నారు.

 

 

కరోనా రేపో, ఎల్లుండో సమసిపోయే సమస్య కాదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కామెంట్ చేశారు. మనం కరోనాతో కలిసి బతకాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. ఉపాయం ఉన్నోడు అపాయం నుంచి బయటపడగలడు. మనల్ని మనం రక్షించుకోవాలని కేసీఆర్ అన్నారు. వైద్యులు, విజ్ఞులు అందరూ చెప్పారు కాబట్టే లాక్‌డౌన్‌ పొడిగింపునకే నిర్ణయం తీసుకున్నామని కేసీఆర్ ప్రకటించారు. మరి ఇదే డైలాగ్ ఏపీ సీఎం జగన్ చెబితే.. అటు చంద్రబాబు, పవన్ కల్యాణ్ విరుచుకుపడ్డారు.

 

 

మరి ఇప్పుడు కేసీఆర్ కూడా అదే డైలాగ్ కొట్టడంతో చంద్రబాబు, పవన్ ల గొంతులో పచ్చివెలక్కాయపడ్డయింది. మరి ఇప్పుడు చంద్రబాబు కేసీఆర్ గురించి ఏం మాట్లాడతారో చూడాలి. దీనిపై అసలు స్పందించే సాహసం కూడా చేయకపోవచ్చు చంద్రబాబు. ఎందుకొచ్చిన గొడవ అంటూ సైలంట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: