ప్రపంచ దేశాలను కబళిస్తున్న కరోనా వైరస్ కు సంబంధించి ప్రస్తుతం ఎన్నో పరిశోధనలు జరుపుతున్న విషయం తెలిసిందే.. కొన్ని ఈ వైరస్కు విరుగుడు కనిపెట్టేందుకు జరుగుతుంటే ఇంకొన్ని పరిశోధనలు  ee వైరస్ ఎలా అభివృద్ధి చెందుతుంది అనేదాని గురించి జరుగుతున్నాయి. అయితే ప్రతి పరిశోధనలో రోజురోజుకు ఏదో ఒక కొత్త అంశం తెరమీదకి వస్తూ ప్రజానీకాన్ని మరింత భయాందోళనకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా అధ్యయనంలో కరోనా వైరస్ కు సంబంధించి మరో విషయం బయటకు వచ్చింది. కరోనా వైరస్ రోజు రోజుకు మరింత బలంగా  మారుతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. 

 

 

 అమెరికాలోని లాస్ అలమోస్  నేషనల్ లాబొరేటరీ శాస్త్రవేత్తల బృందం చేసిన అధ్యయనంలో కరోనా ఎంతగానో బలంగా  మారినట్లు వెల్లడయింది. మొన్నటి వరకు చూసిన వైరస్లో ఒక బంతిలా ఉండి అక్కడ అక్కడ ముళ్ల లాంటి  కొవ్వు పదార్థాలు కనిపించాయని కాని ప్రస్తుతం మాత్రం వైరస్ కి ముళ్ల పదార్థాలు  ఎక్కువగా కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా మరింత బలంగా మారిన మహమ్మారి కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నదని...  ఇది మరింత ప్రమాదకరమైన అంటు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రెండో ప్రపంచ యుద్ధకాలంలో అణ్వాయుధాలను తయారు చేసిన అమెరికా లాబరేటరీ లోనే సైంటిస్టులు తాజాగా ప్రపంచ మహమ్మారి గురించి 33 పేజీలను రిపోర్టును తయారు చేసినట్లు వెల్లడించారు. ఫిబ్రవరిలో యూరప్లో అదనపు ముళ్ళతో  బలం గా మారిన కరోనా  వైరస్ ను  గుర్తించామని ఆ తర్వాత అది అమెరికా తూర్పు తీరం వరకు ప్రపంచ వ్యాప్తంగా పాకిపోయింది అంటూ  శాస్త్రవేత్తలు వెల్లడించారు. 

 

 

 ఎంతగానో బలంగా మారిన ఈ మహమ్మారి వైరస్ ఒక వ్యక్తికి వ్యాపించడమే  కాదు.. ఆ వ్యక్తి ఒకసారి కరోనా  వైరస్ బారి నుంచి బయట పడ్డ తర్వాత మరోసారి కూడా ఆ వ్యక్తికి సోకే ప్రమాదం ఉంది అంటూ వెల్లడించారు శాస్త్రవేత్తలు. అయితే ఈ మహమ్మారి వైరస్ తో ఏర్పడిన కొత్త ముళ్ల కారణంగా ఊపిరితిత్తులలో వున్న కణాలకి ఈ మహమ్మారి వైరస్ శరవేగంగా వ్యాప్తిచెందుతుందని  చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కు విరుగుడు తయారుచేస్తున్న శాస్త్రవేత్తలందరూ కరోనా  వైరస్ రూపురేఖలను సామర్థ్యాన్ని వెంటనే గుర్తించి అందుకు తగిన వాక్సిన్ రూపొందించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: