ఆంధ్రప్రదేశ్ లో చాలా రోజుల తర్వాత మొన్న మద్యం షాపుల గేట్లు తెరిచిన సంగతి తెలిసిందే. రోజుల తరబడి కరవులో ఉన్న మందు ప్రియులు మద్యం షాపుల ముందు భారీగాక్యూ కట్టేశారు. కిలోమీటర్ల కొద్ది బారులు తీరారు. ఈ హడావిడిలో మద్యం ధర 20 శాతం పెరిగినా మందు బాబులు పెద్దగా పట్టించుకోనే లేదు. మందుబాబులు తొలి రోజు ఎంత మద్యం కొనుగోలు చేశారో తెలుసా.. ఏకంగా రూ. 50 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు ఏపీలో జరిగినట్టు తెలుస్తోంది.

 

 

రాష్ట్రానికి ఆదాయం ఎక్కువగా తీసుకొచ్చే అంశాల్లో మద్యం అమ్మకం ఒకటన్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్రానికి ఆదాయం వచ్చినా.. అదేస్థాయిలో జగన్ సర్కారుకు చెడ్డపేరు కూడా వచ్చింది. మందుబాబులు షాపుల ముందు భౌతిక దూరం పాటించకుండా క్యూలు కట్టిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయ్యాయి. ఇన్నాళ్లు కరోనా కోసం చేసిన కష్టం అంతా ఇలాంటి పనులతో బూడిద పాలవుతుందని విమర్శించారు.

 

 

అయితే దీనికి సమాధానం చెప్పుకోవాల్సిన ఏపీ మంత్రులు ఓ కొత్త వాదన తెరపైకి తెస్తున్నారు. ప్రతిపక్ష నేత మద్యం షాపుల వద్దకు టీడీపీ కార్యకర్తలకు డబ్బులు ఇచ్చి పంపించారట. ఈ గందరగోళం అంతా ఆయన సృష్టించిందేనట. మద్యం బాబుల లైన్‌లోకి టీడీపీ కార్యకర్తలను పంపి ఎల్లో మీడియా ద్వారా క్షుద్ర రాజకీయం చేస్తున్నారట.

 

 

ఈ విమర్శలు చూస్తే.. ఎవరికైనా నవ్వు పుట్టించక మానవు. మందుబాబుల్లో కూడా టీడీపీ, వైసీపీ కార్యకర్తలు అని ఉంటారా.. వారిని ఎలా గుర్తిస్తారు.. గుర్తించడం కష్టం కాబట్టి ఎలాగైనా విమర్శలు చేస్తారా.. ఇదేంటి మంత్రివర్యా.. అన్న విమర్శలు వస్తున్నాయి. ఏదేమైనా ఏపీలో ఈ మందు రాజకీయం భలే గమ్మత్తుగా ఉంది కదా.

 

మరింత సమాచారం తెలుసుకోండి: