ఆంధ్రప్రదేశ్ లో కరోనా కట్టడి కోసం జగన్ సర్కారు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా విస్తృతంగా కరోనా పరీక్షలు చేయించడం ద్వారా రాష్ట్రంలో కరోనా జాడలను వాస్తవంగా పసిగడుతోంది. ఆ మేరకు కట్టడి చర్యలు చేపడుతోంది. అంటే.. ఆంధ్రప్రదేశ్ లో కరోనా పరీక్షలు వేగంగా పుంజుకుంటున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 10,292 మందికి పరీక్షలు నిర్వహించారు.

 

 

అంతే కాదు.. కరోనా పరీక్షల్లో ఏపీ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,25,229 మందికి పరీక్షలు నిర్వహించారు. ప్రతి పది లక్షల జనాభాకు 2,345 మందికి పరీక్షలు చేశారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇంత విస్తృతంగా కరోనా పరీక్షలు నిర్వహించలేదని ఏపీ అధికారులు చెబుతున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో కరోనాకు సంబంధించిన మరిన్ని గణాంకాలు ఇలా ఉన్నాయి.

 

 

ఏపీలో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 1.28 శాతం కాగా, 1.9 శాతం మరణాలు నమోదు అయ్యాయి. దేశంలో 3.84 శాతం పాజిటివ్‌ కేసులు, 3.27 శాతం మరణాలు నమోదు అయ్యాయి. రాష్ట్రం లోని నమోదైన మొత్తం 1717 పాజిటివ్ కేసు లకు గాను 589 మంది డిశ్చార్జ్ కాగా, 34 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1094 అని అధికారులు చెబుతున్నారు.

 

 

ఇక ఏపీలో కొత్తగా వచ్చిన కేసుల్లో అనంతపురం జిల్లాలో 2, గుంటూరు జిల్లాలో 13, కడప జిల్లాలో 2, కృష్ణా జిల్లాలో 8, కర్నూలు జిల్లాలో 25, నెల్లూరు జిల్లాలో 1, విశాఖపట్నం జిల్లాలో 2 కేసులతో పాటు రాష్ట్రంలో చిక్కుబడివున్న గుజరాత్ వాసుల్లో 14 మందికి పాజిటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు. కరోనా కట్టడి కోసం జగన్ సర్కారు అన్ని పరీక్షలు నిర్వహిస్తూనే త్వరలో ఏపీకి వచ్చే వారి కోసం ఏర్పాట్లు చేస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: