ఈ మధ్యకాలంలో మనుషుల ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. ప్రాణాలను సైతం తీసేందుకు వెనుకాడటం లేదు. ఇక్కడ ఓ మందుబాబు అలాంటిదే చేశాడు. దాదాపు నెల రోజుల తర్వాత మద్యం తెలుసుకోవడంతో మద్యం తాగాలని ఆతృత అతనిలో నిండిపోయింది. కానీ లాక్ డౌన్  సమయంలో ఉపాధి లేక  డబ్బులు లేక పోవడంతో భార్యని మద్యం కోసం డబ్బులు కావాలని అడిగాడు. భార్య డబ్బులు ఇవ్వకపోవటంతో  తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన వ్యక్తి తుపాకీతో భార్యను కాల్చి చంపేసాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. 

 

 

 వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ లోని బటోలి  గ్రామానికి చెందిన దీపక్ వివాహమై నాలుగేళ్లు కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం అతని భార్య నేహా నాలుగు నెలల గర్భవతి. ఉపాధి కోసం దీపక్  కుటుంబంతో కలిసి ఢిల్లీలో ఉంటున్నాడు. మార్చి నెలలో... పని నిమిత్తం సొంతూరుకు రాగా లాక్ డౌన్  కారణంగా అక్కడ ఇరుక్కుపోయాడు దీపక్. అయితే ఎక్కువగా మద్యం తాగే అలవాటు ఉన్న దీపక్ గత కొన్ని రోజుల లాక్ డౌన్ కారణంగా మద్యం షాపులు తెరుచుకోకపోవడంతో అయోమయంలో పడ్డాడు. కానీ రెండు రోజుల క్రితమే మద్యం షాపులు తెరుచుకోవడంతో అతనికి ప్రాణం లేచి వచ్చింది. కానీ డబ్బులు లేవు. ఇంతలో భార్యను డబ్బులు కావాలంటు అడిగాడు.. ఇంట్లో సరుకులు కి డబ్బులు లేవు ఇక మద్యానికి ఎక్కడివి  అంటూ భార్య నేహ దీపక్ ను  నిలదీసింది. 

 

 

 దీంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన దీపక్ తన దగ్గరున్న నాటు తుపాకీతో భార్యను విచక్షణా రహితంగా కాల్చాడు. దీంతో భార్య స్నేహ అక్కడికక్కడే కుప్పకూలియింది . ఇక ఈ సమయంలో అక్కడే ఉన్న నాలుగేళ్ళ కుమారుడు భయంతో పక్కనే ఉన్న పొదల్లోకి పారిపోయాయి. తుపాకీ శబ్దం విని ఇరుగు పొరుగు వారు వెంటనే అక్కడికి చేరుకుని ఆమెను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే తీవ్ర రక్తస్రావమైన  నేహా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది.  ఇక స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీపక్ ను  అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. గర్భవతి అని కూడా చూడకుండా విచక్షణ రహితంగా భార్యను కాల్చిచంపిన దీపక్ ను  కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: