ఒకప్పుడు చైనా వస్తువులంటే ఎంతో మోజుపడి తీసుకున్నాం.. మెడిన్ చైనా అంటే గర్వంగా ఖరీదు చేసేవాళ్లం.. అలా చైనా ఆర్ధికవ్యవస్దను బలంగా మార్చాం.. ఎందుకంటే మార్కెట్‌కు వెళ్లితే చాల వరకు వస్తువులు మెడిన్ చైనావే కనిపిస్తాయి.. చివరికి పిల్లలు ఆడుకునే బొమ్మల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.. అవికూడా చైనావే.. ఇలా చైనా వాడు అందరిలో కలిసిపోయి తన వ్యాపార రంగాన్ని విసృతంగా విస్తరింపచేసుకున్నాడు.. కానీ తన బుద్ధిని మాత్రం మార్చుకోలేదు..

 

 

ఎప్పుడూ పనికిమాలిన ప్రయోగాలు చేసుకుంటూ తన దేశం ఆపదలో పడకుండా.. ఇతరదేశాలను తన చెప్పుచేతల్లో ఉంచుకోవాలనే దుర్భుద్ధిని లోలోపల పెంచుకుని అవసరం వచ్చినప్పుడు దాన్ని భయటపెడుతున్నాడు.. ఇలా చూసుకుంటే మిగతా దేశాలకంటే చైనా వల్లే ఎన్నో సార్లు ప్రపంచ దేశాలకు ముప్పు వాటిల్లింది అని అంటున్నారు నిపుణులు.. తాజాగా వచ్చిన కరోనా వైరస్ గురించి అందరికి తెలిసిందే.. అది ఎక్కడి నుండి వ్యాపించిందో కూడా తెలిసిందే.. ఒక విధంగా చైనా చేస్తున్న ప్రతి పనిలో ఎంతో కొంత నష్టం దాగి ఉంటుంది.. ఇక టెక్నాలజీ గురించి మాట్లాడితే ఇందులో కూడా అత్యధికంగా మోసాలు చేస్తున్నది చైనా తయారు చేసిన యాప్‌లతోనే.. ఇదిగో ఇప్పుడు మరో మోసం బయటకు వచ్చింది.. అదేమంటే కొన్ని చైనా యాప్స్.. మొబైల్ యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని కొట్టేస్తున్నాయి.

 

 

ఫేస్‌బుక్ వేదికగా అందమైన అమ్మాయిల ఫోటోలతో యాడ్స్ ఇస్తూ యూజర్లకు వల వేస్తున్నాయట. ఈ యాడ్స్‌లో అందమైన అమ్మాయిలు కనిపిస్తూ, చాట్ చేసేందుకు యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోమని సూచిస్తున్నారట.. ఆ క్షణంలో కనుక మనసు బలహీనపడి వారితో చాటింగ్ చేయొచ్చు అనే ఆశతో ఆ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే వ్యక్తిగత సమాచారం వారి చేతిలోకి వెళ్లిపోతుందట.. ఈ విషయాన్ని సాంకేతిక నిపుణులు పసిగట్టారు. ఫేస్‌బుక్ ద్వారా ఇతర యాప్స్‌లోకి లాగిన్ అయ్యేవారు జాగ్రత్తగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.

 

 

ఇందుకోసం యాడ్స్ అంటూ ఫేస్‌బుక్‌కు భారీ మొత్తంలో చెల్లింపులు జరుపుతున్నారట. అందుకే తొందర పడ్డారో ఇక అంతే సంగతులు! మీ మొబైల్‌లోని వ్యక్తిగత సమాచారం అంతా హాంఫట్ అయితే జరిగే నష్టం గురించి ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదనుకుంటా.. అసలే కరోనా కష్టకాలం కోరి కష్టాలు తెచ్చుకోకండని చెబుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: