జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా రాజకీయ ప్రముఖులను నిర్బంధంలో ఉంచిన విష‌యం తెలిసిందే. అందులో  భాగంగానే మాజీ సీఎం మెహబూబా నివాసముంటున్న ఫెయిర్ వ్యూ ఇంటినే సబ్సిడరీ జైలుగా మార్చి అందులో నిర్బంధంలో ఉంచారు. ఆమెతో పాటు  పీడీపీ నేతలు సాగర్, మదానీలను గుప్ కర్ మార్గంలోని ప్రభుత్వ భవనంలో ఉంచారు. అయితే ఆమె త్వ‌ర‌లో విడుద‌ల కావాల్సి ఉండ‌గా మెహబూబా ముఫ్తీ ఇతర నేతలు అలీ ముహమ్మద్ సాగర్, సర్తాజ్ మదానీల నిర్బంధం గడువును మరో మూడునెలల పాటు పెంచుతూ జమ్మూకశ్మీర్ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

 

ప్రజా భద్రత చట్టాన్ని వీరిపై ప్ర‌యోగిస్తూ మరో మూడునెలలపాటు కొనసాగిస్తూ గృహనిర్బంధంలో ఉంచాలని సర్కారు ఆదేశించింది. 2018 జూన్ వరకు మెహబూబా బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసి సీఎంగా పనిచేసిన విష‌యం తెలిసిందే. ఇదిలా ఉండ‌గా  ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో నిర్బంధంలో ఉన్న జమ్మూకాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌(ఎన్‌సీ) నాయకులు ఒమర్‌ అబ్దుల్లా కొద్దిరోజుల క్రితం విడుదలయ్యారు. దాదాపు ఎనిమిది నెలల పాటు నిర్బంధంలో కొన‌సాగారు. ట్విట్ట‌ర్లో ఎంతో ఆక్టివ్‌గా ఉండే ఒమ‌ర్ అబ్దుల్లా  '' ఈరోజు ప్రపంచం చాలా భిన్నంగా ఉన్నది'' అంటూ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. 

 

గతేడాది ఆగస్టు 5న కేంద్రం జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370రద్దుకు ముందు ఒమర్‌తో పాటు ఆయన తండ్రి, ఎన్‌సీ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీతో పాటు పలువరు రాజకీయ నాయకులను మోడీ సర్కారు నిర్బంధంలో ఉంచింది. క‌శ్మీర్లో సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొన‌లేద‌న్న‌ది కేంద్ర హోంశాఖ అధికారుల‌కు నిఘా సంస్థ‌ల నుంచి స‌మాచారం అందుతుండ‌టంతోనే ముఫ్తిని మ‌రికొన్నాళ్లు గృహ నిర్బంధంలో కొన‌సాగించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది. అయితే మెహబూబా ముప్తీతో పాటు నిర్బంధంలో ఉన్న మిగతా నాయకులను సైతం విడుదల చేయాలని ప‌దేప‌దే ఒమర్ అభ్య‌ర్థిస్తున్నారు. 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: