ఈ కరోనా పుణ్యమా అని ప్రపంచం మొత్తం లాక్ డౌన్ జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే కొన్ని దేశాల్లో ఈ పరిస్థితిని దాటుకొని దాని నుంచి బయటికి వచ్చాయి అని చెప్పవచ్చు. అక్కడ అన్ని రకాల ఉత్పత్తులు, రవాణా వ్యవస్థ తిరిగి యథావిధిగా ప్రారంభమయ్యాయి. ఇక ప్రస్తుతం భారతదేశంలో మాత్రం ఈ విధానం కొనసాగుతూనే ఉంది.


భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు ప్రస్తుతం మూడో సారి మే 17 వరకు లాక్ డౌన్ ను అమలు పరుస్తున్నారు దేశంలో. అయితే ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో గ్రీన్ జోన్ లో ఉన్న ప్రాంతాల్లో మాత్రం కొన్నిటికి మినహాయింపు ఇచ్చి పనులు మొదలు పెట్టడం జరిగింది. దీనితో పాటు కొన్ని రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు కూడా పెరగడంతో రాష్ట్ర ఖజానాకు ఒకింత ఆదాయం సమకూరుతుంది. ఇక ఈ విషయం పక్కన పెడితే దేశంలో ఎలక్ట్రానిక్ రంగంపై కాస్త ఎక్కువగానే ప్రభావం పడిందని చెప్పవచ్చు. అయితే ఈ గడ్డు పరిస్థితి నుంచి బయట పడేందుకు కంపెనీలు ప్రజలను ఆఫర్లతో మభ్యపెడుతూ వాటి వైపు ఆకర్షిస్తున్నాయి.


ఇక పూర్తి వివరాల్లోకి వెళితే ప్రముఖ ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థ సాంసంగ్ ఒక ఆఫర్ ను ప్రకటించింది. " స్టే హోమ్ స్టే హ్యాపీ " అనే పేరుతో ఈ ఆఫర్ ను ప్రకటించి. ఈ ముందస్తు ఆఫర్లో ఏకంగా 15 శాతం క్యాష్ బ్యాక్, EMI లపై ఎటువంటి అదనపు చెల్లింపులు ఉండవని కంపెనీ చెప్పుకొచ్చింది. అయితే ఈ ఆఫర్ కోసం సాంసంగ్ షాప్, ఎక్స్ ప్రెస్ డెలివరీలలో ఈ నెల 8వ తారీఖు లోపు ఆన్లైన్ లో బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని సంస్థ తెలియజేసింది. ఇక ఇందులో కేవలం టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్ మిషన్లు లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని సంస్థ తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: