ప్రపంచంలో కరోనా మహమ్మారి ప్రభావం ఎంత ఘోరంగా ఉందో ప్రతిరోజూ మరణాల, కేసుల సంఖ్య చూస్తే అర్థం అవుతుంది.  ఈ కరోనా వల్ల మనుషుల ప్రాణాలే కాదు..ఆర్థిక వ్యవస్థ కూడా చిన్నాభిన్నం అవుతుంది.  మనిషిక డబ్బు అంటే ఎంత ప్రాణమో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.. రోడ్డు పై ఒక్క రూపాయి దొరికినా ఈ రోజు నా అదృష్టం అనుకుంటాడు.  అలాంటిది వందలు వేలు కనిపిస్తున్నా కరోనా భయానికి ఆమడ దూరం పరుగెడుతున్నాడు.  కొన్ని దేశాల్లో ఇప్పటికే పాత కరెన్సీని కరోనా ఉందన్న కారణంగా రోడ్లపై విసిరారు.. కానీ ఒక్కరు ముట్టుకోలేదు.  ఇక మనదేశంలో కూడా పలు చోట్ల రూ. 50 నుంచి రూ. 2000 వేల నోట్ల వరకు రోడ్లపై కనిపించినా దానికి కరోనా ఉందన్న భయంతో వాటి వంక చూడటం లేదు.

 

 కొంత మంది ఆకతాయిలు.. సంఘ విద్రోహులు కరోనా పెరిగిపోవాలని ఇలా నోట్లు వెదజల్లుతున్నారన్నభయంతో వాటిని ముట్టుకోవడం లేదు.  పోలీసులు సైతం వారిటిని ఎంతో జాగ్రత్తగా సేకరిస్తున్న పరిస్థితి. ఈ కరోనా భయమే ఇప్పుడు ఓ ఆటో వాలకు సేఫ్ అయ్యింది.  వివరాల్లోకి వెళితే.. బీహార్ లోని సహర్ష జిల్లాలో ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నగజేంద్ర షా, అనే వ్యక్తి, కొన్ని వస్తువులు కొనుగోలు చేసేందుకు రూ. 25 వేలు జేబులో పెట్టుకుని బయటకు వెళ్లాడు. మార్కెట్ కి వెల్లే ముందు తన జేబులో ఉన్న పొగాకు ప్యాకెట్ ను తీసే సమయంలో రూ. 20,500 రోడ్డుపై పడిపోయాయి.

 

దాంతో వెనక్కి వచ్చి ఎక్కడ చూసినా అవి కనిపించలేదు. కన్నీరు పెట్టుకుంటూ ఇంటికి వెళ్లాడు. అంతలోనే ఫేస్ బుక్ లో ఓ వార్త కనిపించింది. రోడ్డుపై పడిన డబ్బును కరోనా భయంతో ఎవరూ తీసుకోకపోవడంతో, ఉడా కిషన్ గంజ్ పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారన్నవార్త చూడగానే వెంటనే స్టేషన్ కి వెళ్లి ఆధారాలు సమర్పించడంతో, పోలీసులు దాన్ని వెనక్కు ఇచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: