కేంద్ర ప్రభుత్వం ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ రోజురోజుకు దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 40 వేలకు దాటిపోయినా కరోనా కేసుల సంఖ్య 50 వేలకు చేరువలో ఉంది. దీంతో దేశ ప్రజలందరూ మరింత భయాందోళనకు గురవుతున్నారు. ఇక ఈ మహమ్మారి వైరస్ కు సరైన విరుగుడు కూడా అందుబాటులో లేకపోవడంతో... మరింత ఆందోళన చెందుతారు ప్రజలు. ఇక గడచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్తగా కరోనా  వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని  అధికారులు తెలిపారు. గడచిన 24 గంటల్లో మొత్తం 3,900 కేసులు నమోదయ్యాయని... ఇదే సమయంలో అటు మరణాల సంఖ్య కూడా రికార్డు స్థాయిలోనే సంభవించింది అంటూ తెలిపారు. గత 24 గంటల వ్యవధిలో ఏకంగా ఈ మహమ్మారి వైరస్ బారినపడి 195 మంది మరణించినట్లు వెల్లడించారు. 

 

 

 అయితే దేశంలో కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి ఈ రోజు వరకు ఇంత భారీ సంఖ్యలో కొత్త కరోనా  కేసులు నమోదు అవ్వడం కానీ లేదా మరణాల సంభవించడం గానీ జరగలేదని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే దేశ వ్యాప్తంగా రాష్ట్రాలవారీగా చూసుకుంటే కరోనా వైరస్ కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రంగా మహారాష్ట్ర తొలి స్థానంలో ఉన్నది. కేవలం మహారాష్ట్ర ఒక్క రాష్ట్రంలోనే 14,546 కరుణ వైరస్ కేసులు నమోదవగా.. కేవలం మహారాష్ట్రలోని 523 మంది మరణించారు. ఇక గత 24 గంటల్లో సంభవించిన 195 మరణాల్లో 98 మరణాలు కేవలం పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో జరిగితే, మహారాష్ట్రలో 35,  గుజరాత్ లో  29 మరణాలు సంభవించాయని  కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. 

 

 

 అయితే మొన్నటి వరకు ఇతర దేశాలతో పోలిస్తే భారత దేశంలో కరోనా  వైరస్ కేసుల సంఖ్య తక్కువగా ఉందని ఆనంద పడినప్పటికీ.. ప్రస్తుత పరిస్థితులు మాత్రం ఆందోళన కలిగించే విధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే దేశంలో దాదాపు 40 రోజులకు పైగా దేశంలో లాక్ డౌన్  అమలులో ఉంది. ఎలాంటి సడలింపు లేకుండా 40 రోజులు అమలుచేశారు దేశంలో. అదే సమయంలో 40 రోజులలో పూర్తి చేసుకున్న చైనా ఫ్రాన్స్ ఇటలీ లాంటి దేశాలతో పోల్చితే భారతదేశంలో నమోదవుతున్న కొత్త పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఏప్రిల్ 30వ తేదీ వరకు 33, 610 కరోనా  కేసులు ఉండగా మే 4వ తేదీ వరకు 42, 553 పెరిగాయంటే కరోనా  ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుంది అర్థం చేసుకోవచ్చు. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే దాదాపు కొత్తగా తొమ్మిది వేల కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారులు మరింత ఆందోళన చెందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: