ఎటు చూసిన కూడా కరోనా మాటనే వినపడుతుంది..రోజు రోజు కూ కరోనా వల్ల చాలా మంది మృత్యువాత పడుతున్నారు.. మరీ కొందరు మాత్రం కరోనా కారణంగా  క్వారంటైన్ లో బాధపడుతున్నారు.. ఇకపోతే కరోనా కట్టడి లో భాగంగా ప్రభుత్వం లాక్ డౌన్ పేరుతో ప్రజలను ఇళ్లకే పరిమితం అయ్యేలా చేసింది.. అయినా కూడా కరోనా ప్రభావం ఎక్కడా తగ్గలేదు.. 

 

 

 

 

 

 

 

కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు.. కుల మతాలకు అతీతంగా పేదలకు  సాయం చేయడంలో ముండుకొస్తూ మరో సారి భారత దేశం సకల మత సమ్మేళనం అని నిరూపించింది ..  దేశ వ్యాప్తంగా మే 17 వరకు లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉంటూ కరోనా సోకకుండా జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు. 

 

 

 

 

 

 

మళ్లీ వైరస్ తీవ్రత పెరుగుతుందనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. కరోనా వైరస్ కేసులు లక్ష దాటడానికి సిద్ధమవుతున్నాయి.. దీంతో కేసీఆర్ మరొక నిర్ణయానికి తెర లేపారు అని విశ్వసనీయ వర్గాల్లో గుస గుసలు వినపడుతున్నాయి..లాక్ డౌన్ కారణంగా అన్నీ రకాల వ్యాపార, వాణిజ్య సంస్థలు పూర్తిగా మూతపడిన సంగతి తెలిసిందే.. అయితే, మద్యం దుకాణాలు కూడా బంద్ కావడంతో చాలా మంది మందుబాబులు వింతగా ప్రవర్తించారు. మద్యం దొరక్క అల్లాడుతున్న మందుబాబులు ఏది దొరికితే అది తాగేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

 

 

 

 

ఈ నేపథ్యంలో తాజాగా మద్యం దుకాణాలను తెరుస్తున్నట్లు ప్రకటన చేశారు.  అంతేకాక రెడ్ జోన్ ఏరియాల్లో కూడా మద్యం దుకాణాలను తెరవాలని తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.. ఈ మేరకు ఉదయం నుంచి మందుబాబులు దుకాణాల ముందు బారులు తీరారు.. దీంతో కేసీఆర్ మరో నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు తెలిపారు.. అదేంటంటే వారానికి రెండుసార్లు మాత్రమే దుకాణాలు తెరిచెలా ఉండాలని సీఎం ఆలోచిస్తున్నారట .. మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే అధికారంగా ప్రకటించే వరకు ఆగాల్సిందే..

 

మరింత సమాచారం తెలుసుకోండి: