లాక్‌డౌన్‌ సడలింపు లో భాగంగా ఏపీ సర్కార్ ఒక్కో  సమస్య పై ఫోకస్ పెడుతూ పరిష్కారాలు చూపిస్తూ  వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా రైతులకు సంబంధించిన సమస్యలపై దృష్టిసారించింది జగన్మోహన్ రెడ్డి  సర్కార్. ప్రస్తుతం వరి పంట తో పాటు పలు ఇతర పంటలు కూడా సేకరణతో పాటు కీలక అంశాలపై కూడా అధికారులతో తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  చర్చ జరిపారు. ఈ సందర్భంగా మే 30వ తేదీన రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. కాంప్రహెన్సివ్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రోక్యూర్మెంట్ యాప్ లో గతంలో ముఖ్యమంత్రి సూచనల మేరకు అధికారులు పలు మార్పులు చేసినట్లు తెలుస్తోంది. 

 

 

 ఇక ఈ సమావేశంలో ఈ యాప్ లో మార్పులకు సంబంధించిన వివరాలను అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలుపుతూ...  యాప్ పనితీరును కూడా ముఖ్యమంత్రికి వివరించారు అధికారులు. అయితే ఈ నెల 30వ తేదీన రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించాలని ఆదేశించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈలోగా మండల జిల్లాస్థాయి వ్యవసాయ అడ్వైసరి బోర్డులను  కూడా ఏర్పాటు చేయాలి అంటూ ఆదేశించారు. ఏ గ్రామంలో ఏ పంట వెయ్యాలి..?  ఏ పంట వేస్తే మంచి దిగుబడి వస్తుంది అన్న విషయాలపై రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు ఇచ్చేందుకు వ్యవసాయ అడ్వైసరి బోర్డ్ లను మండల జిల్లా స్థాయిలలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచనలు చేశారు. 

 

 

 ఇక గ్రామస్థాయిలో పంట సేకరణకు  కూడా అధికారులు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని సూచించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. జిల్లాలో వ్యవసాయ అనుబంధ రంగాల బాధ్యతలను జాయింట్ అప్పగించాలని...  అధికారులు రూపొందించిన యాప్ పై  జాయింట్ కలెక్టర్లకు  అవగాహన కల్పించాలని ఆదేశించారు. అంతేకాకుండా రైతుల నుంచి పంట సేకరణ విధానాల్లో  ఏవైనా లోపాలు ఉంటే వాటిని క్షుణ్ణంగా పరిశీలించి అధ్యయనం చేసిన తర్వాత వాటిని సవరించాలని.. వంట సేకరణ విషయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలి అంటూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. పంట సేకరణతో పాటు కొనుగోలు విషయంలో కూడా అధికారులకు పలు సూచనలు సలహాలు ఇస్తూ దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: