ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని వర్గాల ప్రజలను పరిగణలోకి తీసుకుంటూ పలు పథకాలను ప్రవేశపెడుతూ చరిత్ర సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దాదాపుగా అన్ని వర్గాల ప్రజలకు  పథకాలను  ప్రవేశపెట్టి చేయూత  ఇస్తున్నారు ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇక తాజాగా మత్స్యకారులకు చేయూతనిచ్చే విధంగా మరో సంచలన పథకాన్ని  అమలు చేస్తున్నారు. వైయస్సార్  మత్స్యకార భరోసా పథకాన్ని  తాజాగా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. 

 

 

 తాడేపల్లి లోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  బటన్ నొక్కగానే మత్స్యకారుల బ్యాంకు ఖాతాలో 10 వేల రూ.. జమ అయ్యాయి. ఇక ఏపీ సర్కార్ ప్రవేశపెట్టిన వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం ద్వారా లక్ష తొమ్మిది వేల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి... వేట నిషేధ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్స్యకారులు అందరికీ పది వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. కరోనా  వైరస్ పోరులో ప్రభుత్వానికి ఎన్నో కష్టాలు ఉన్నప్పటికీ దానికంటే మత్స్యకారులు కష్టాలు పెద్దవి కాబట్టి ముందుగా వారికి వేట నిషేధ సమయంలో మత్స్యకారులను ఆదుకునేందుకు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా పథకాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పుకొచ్చారు. 

 

 

 ఇక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో  మంత్రి మోపిదేవి వెంకటరమణ సహా పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని.. కలెక్టర్లు పాల్గొన్నారు... అంతేకాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలువురు మత్స్యకారులతో స్వయంగా సీఎం జగన్ మాట్లాడారు. మత్స్యకారులకు ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి. 

మరింత సమాచారం తెలుసుకోండి: